AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trivikram : త్రివిక్రమ్ డైరెక్షన్‏లో ఆ స్టార్ హీరో.. కొబ్బరికాయ కొట్టేసిన గురూజీ.. మరోసారి హిట్ కాంబో రిపీట్..

డైరెక్టర్ త్రివిక్రమ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. చివరగా మహేష్ బాబుతో కలిసి గుంటూరు కారం సినిమాతో హిట్టు అందుకున్న గురూజీ.. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. దీంతో త్రివిక్రమ్ నెక్ట్స్ ఏ హీరోతో సినిమా చేయబోతున్నారనే క్యూరియాసిటీ మాత్రం నెలకొంది.

Trivikram : త్రివిక్రమ్ డైరెక్షన్‏లో ఆ స్టార్ హీరో.. కొబ్బరికాయ కొట్టేసిన గురూజీ.. మరోసారి హిట్ కాంబో రిపీట్..
Trivikram
Rajitha Chanti
|

Updated on: Aug 15, 2025 | 2:08 PM

Share

డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. చివరగా మహేష్ బాబుతో కలిసి గుంటూరు కారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు గురూజీ. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత మహేష్.. డైరెక్టర్ రాజమౌళితో కలిసి SSMB 29 మూవీ చేస్తుండగా.. త్రివిక్రమ్ మాత్రం మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. దీంతో త్రివిక్రమ్ నెక్ట్స్ ఎవరితో సినిమా చేయబోతున్నారనే క్యూరియాసిటీ నెలకొంది. కొన్ని రోజులుగా త్రివిక్రమ్ అప్ కమింగ్ మూవీ గురించి అనేక విషయాలు నెట్టింట వైరలవుతున్నాయి. అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇలా చాలా మంది తారల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా గురూజీ కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురూజీ కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కింది.

ఇవి కూడా చదవండి: Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?

త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తోన్న కొత్త సినిమాలో నటించబోయే స్టార్ హీరో మరెవరో కాదండి.. విక్టరీ వెంకటేశ్. ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు వెంకటేశ్. ఈ మూవీ ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూల్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు తన నెక్ట్స్ సినిమా త్రివిక్రమ్ తో కలిసి చేయబోతున్నారు. ఈరోజు (ఆగస్ట్ 15న) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమం నిర్వహిస్తూ అధికారికంగా ప్రకటించారు. నిర్మాత రాధకృష్ణ నిర్మాణంలో హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు.

ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..

వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం. గతంలో వీరిద్దరి కాంబోలో నువ్వు నాకు నచ్చావ్, మళ్లీశ్వరి సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు మరోసారి వీరి కాంబో రిపీట్ కాబోతుండడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..

ఇవి కూడా చదవండి: Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..