Director Sukumar: అమలాపురంలో సతీమణితో కలిసి సుకుమార్ సందడి.. పుష్ప షూటింగ్ పై అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్..
ఆయన బెస్ట్ ఫ్రెండ్ పంచాయతీ రాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అన్యం రాంబాబు ఇంట్లో కుటుంబం సభ్యులతో సరదాగా గడిపారు. సుకుమార్ దంపతులకు కోనసీమ ఆతిధ్యం రుచి చూపించారు స్నేహితుడు రాంబాబు. ఈ క్రమంలో పుష్ప షూటింగ్ అప్డేట్స్ రివీల్ చేశారు.

అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దర్శకుడు సుకుమార్ సందడి చేశారు. తన చిన్ననాటి స్నేహితుడు రాంబాబు ఇంట్లో సతీమణితో కలిసి సరదాగా గడిపారు. ఆయన బెస్ట్ ఫ్రెండ్ పంచాయతీ రాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అన్యం రాంబాబు ఇంట్లో కుటుంబం సభ్యులతో సరదాగా గడిపారు. సుకుమార్ దంపతులకు కోనసీమ ఆతిధ్యం రుచి చూపించారు స్నేహితుడు రాంబాబు. ఈ క్రమంలో పుష్ప షూటింగ్ అప్డేట్స్ రివీల్ చేశారు. ఈనెల 27 నుండి 29 వరకు పుష్పా షూటింగ్ మారేడిమల్లి లో జరుగుతుందన్నారు. అదే షెడ్యూల్లో విలన్ పై చిత్రీకరణ ఉంటుందని తెలిపారు. కోనసీమ మట్టపర్రు గ్రామ వాసి అయిన సుకుమార్ చాలా కాలం తర్వాత కొనసీమలో అడుగుపెట్టారు. సతీమ తో సహా తన ఇంటికి రావడం సంతోషంగా ఉందని తెలిపారు ఆయన స్నేహితుడు రాంబాబు.
ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. స్టైలీస్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల బన్నీ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన టీజర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఇందులో రష్మిక, ఫహద్ ఫాజిల్ , అనసూయ, సునీల్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు.




ఇక లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కీలకపాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆయన పాత్ర మరింత హైలెట్ కానుందని.. పుష్ప రాజ్ ను ఇంట్రడ్యూస్ చేసే పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని టాక్.