Spirit Movie: ‘స్పిరిట్’ మూవీలో ప్రభాస్ రోల్ అలా ఉండబోతుంది.. ఆసక్తికర విషయాలు చెప్పిన డైరెక్టర్..
ఇటీవల నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ చేస్తోన్న అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో సందడి చేసిందీ చిత్రయూనిట్. ఇందులో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. అలాగే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా యంగ్ రెబల్ స్టార్ అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న స్పిరిట్ సినిమా గురించి ఎప్పటికప్పుడు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా స్పిరిట్ సినిమాలో ప్రభాస్ రోల్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపెట్టాడు.

దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ‘యానిమల్’ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా క్షణం తీరిక లేకుండా మీడియాతో, అభిమానులతో ఇంట్రాక్ట్ అవుతున్నారు. డిసెంబర్ 1న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుండడంతో ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ చేస్తోన్న అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో సందడి చేసిందీ చిత్రయూనిట్. ఇందులో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. అలాగే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా యంగ్ రెబల్ స్టార్ అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న స్పిరిట్ సినిమా గురించి ఎప్పటికప్పుడు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా స్పిరిట్ సినిమాలో ప్రభాస్ రోల్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపెట్టాడు.
యానిమల్ సినిమా.. ఎమోషనల్ హై ఎండ్ ఉండే తండ్రి కొడుకుల కథగా రూపొందించామని.. ఈ మూవీలో స్ట్రాంగ్ లవ్ స్టోరీ కూడా ఉంటుందన్నారు. అలాగే ఈ మూవీ తర్వాత ప్రభాస్ ప్రధాన పాత్రలో స్పిరిట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామన్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబర్ నుంచి రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని.. ఇందులో ఫియర్ లెస్ కాప్ గా ప్రభాస్ పవర్ఫుల్ రోల్ లో కనిపించనున్నట్లు తెలిపారు. యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఊహించని స్థాయిలో డార్లింగ్ రోల్ ఉంటుందని అన్నారు. దీంతో స్పిరిట్ మూవీపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అటు ప్రభాస్ ప్రస్తుతం సలార్, కల్కి చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ మూవీస్ తర్వాత కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram
ఇదిలా ఉంటే.. రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన లేటేస్ట్ చిత్రం యానిమల్.. డిసెంబర్ 1న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. తండ్రి కొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో రణబీర్ తండ్రిగా అనిల్ కపూర్ కనిపించగా.. బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించారు. విడుదలకు ముందే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ దూసుకుపోతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.