AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరో లేకుండా సినిమా చేస్తా.. కానీ ఆ మూవీ వాళ్లకు నచ్చదేమో.. సందీప్ రెడ్డి క్రేజీ కామెంట్స్

అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఆయన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. మాస్, యాక్షన్, రొమాంటిక్, లవ్ ఇలా అన్ని ఎమోషన్స్ కలగలిపి యూత్ ఆకట్టుకునేలా సినిమాలను రూపొందిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో రౌడీ హీరో విజయ్ దేవరకొండకు స్టార్ డమ్ తెచ్చిపెట్టాడు.

హీరో లేకుండా సినిమా చేస్తా.. కానీ ఆ మూవీ వాళ్లకు నచ్చదేమో.. సందీప్ రెడ్డి క్రేజీ కామెంట్స్
Sandeep Reddy Vanga
Rajeev Rayala
|

Updated on: Mar 04, 2025 | 4:16 PM

Share

సందీప్ రెడ్డి వంగ.. చేసింది మూడు సినిమాలు.. స్టార్ దర్శకులను మించి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఆయన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. మాస్, యాక్షన్, రొమాంటిక్, లవ్ ఇలా అన్ని ఎమోషన్స్ కలగలిపి యూత్ ఆకట్టుకునేలా సినిమాలను రూపొందిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో రౌడీ హీరో విజయ్ దేవరకొండకు స్టార్ డమ్ తెచ్చిపెట్టాడు. ఇక ఇటీవల యానిమల్ సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ క్రేజ్ ఒక్కసారిగా మార్చేశారు. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా పనులను మొదలు పెట్టేశాడు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. ఇదిలా ఉంటే తాజాగా సందీప్ రెడ్డి వంగ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసలు హీరో లేకుండా సినిమా చేస్తా అని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు సందీప్ రెడ్డి వంగ.

తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ ఆసక్తికర కామెంట్స్ చేశారు.   ‘మీరు పాటలు లేకుండా సినిమా తీస్తారా? లేదంటే హీరో లేకుండా తీస్తారా?. రెండిటిలో ఒకదాన్ని ఎంచుకోండి అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. ‘హీరో లేకుండా సినిమా తీయాలనేది నా మైండ్ లో ఉంది. ఒకవేళ అలాంటి సినిమా తీస్తే.. నా సినిమాలు ఎవరైతే విమర్శించారు.. ఆ మహిళలకు ఆ సినిమా కూడా నచ్చదు. కావాలంటే ఈ విషయాన్ని నేను రాసిస్తాను. ఖచ్చితంగా నేను హీరో లేకుండా సినిమా చేస్తా.. 4, 5 సంవత్సరాల్లో నేను హీరో లేకుండా సినిమా తీస్తాను. ఇప్పుడు విమర్శిస్తున్న వారంతా ‘5 ఏళ్ల క్రితం సందీప్‌ చెప్పింది. చేసి చూపించాడు’ అని మాట్లాడుకుంటారు అని సందీప్ అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ కామెంట్స్ పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి చెప్పాడంటే చేసి చూపిస్తాడు అని కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..