AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: ‘అర్జున్ రెడ్డి ఫస్ట్ ఛాయిస్ అల్లు అర్జున్.. కానీ’.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కామెంట్స్..

ఇందులో విజయ్ నటనతో ప్రజలకు మరింత దగ్గరయ్యాడు. ఇందులో షాలిని పాండే కథానాయికగా నటించింది. యూత్ ఎంటర్టైనర్‏గా వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. అటు ఇదే చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశారు డైరెక్టర్ సందీప్. నార్త్ లోనూ ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజానికి ఈ సినిమాను ముందుగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‏తో చేయాలనుకున్నారట. కానీ కుదరకపోవడంతో విజయ్ తో తీసినట్లు తెలిపారు.

Allu Arjun: 'అర్జున్ రెడ్డి ఫస్ట్ ఛాయిస్ అల్లు అర్జున్.. కానీ'.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కామెంట్స్..
Arjun Reddy, Allu Arjun
Rajitha Chanti
|

Updated on: Jan 06, 2024 | 11:28 AM

Share

2017లో బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ సృష్టించిన సినిమా అర్జున్ రెడ్డి. హీరోగా విజయ్ దేవరకొండకు మంచి క్రేజ్ తీసుకువచ్చిన మూవీ ఇది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాపై ఓవైపు భారీ ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకులను నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో విజయ్ నటనతో ప్రజలకు మరింత దగ్గరయ్యాడు. ఇందులో షాలిని పాండే కథానాయికగా నటించింది. యూత్ ఎంటర్టైనర్‏గా వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. అటు ఇదే చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశారు డైరెక్టర్ సందీప్. నార్త్ లోనూ ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజానికి ఈ సినిమాను ముందుగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‏తో చేయాలనుకున్నారట. కానీ కుదరకపోవడంతో విజయ్ తో తీసినట్లు తెలిపారు.

ఇటీవల ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ సందీప్ మాట్లాడుతూ.. అర్జున్ రెడ్డి సినిమాకు ఫస్ట్ ఛాయిస్ అని అన్నారు. “2011లో ఓ కథను బన్నీకి చెప్పాను. కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి కథను ఆయనకు వినిపించాలనుకున్నాను. కానీ ఆయన్ని కలవలేకపోయాను. అదే కథతో చాలా మంది నటులు, నిర్మాతలను కలిశారు. చివరకు నేనే నిర్మించాను. విజయ్ దేవరకొండ నా స్నేహితుడి ద్వారా పరిచయమయ్యాడు. చివరకు అతడితో నేను అర్జున్ రెడ్డి సినిమా చేశాను” అంటూ చెప్పుకొచ్చాడు. దాదాపు 13 సంవత్సరాల తర్వాత బన్నీతో సినిమా చేసే అవకాశం వచ్చింది. దేనికైనా సమయం రావాలని అన్నాడు.

ఇటీవలే యానిమల్ సినిమాతో మరోసారి సూపర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ సందీప్. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మిక కలిసి నటించిన ఈ సినిమా రూ. 800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం స్పిరిట్ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నాడు సందీప్. ఇందులో ప్రభాస్ హీరోగా నటించనున్నాడు. ఈ మూవీ తర్వాత బన్నీతో కొత్త ప్రాజెక్ట్ చేయనున్నాడు.

View this post on Instagram

A post shared by Instagram (@instagram)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.