Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ వాయిస్ మారడానికి కారణం అదే.. గొంతుపై మానని గాయాలు..

విరూపాక్ష సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు తేజ్. ఇప్పుడు తన సినిమాలు, కంటెంట్ ఎంపికలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ప్రమాదం తర్వాత తేజ్ జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా తేజ్ వాయిస్ మారిపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇటీవల తెలుగు రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ్ తన లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. ఈ సమావేశంలో సాయి ధరమ్ తేజ్, శ్రుతి హాసన్, శ్రియా రెడ్డి, నిర్మాత శోభు యార్లగడ్డ, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ పాల్గొన్నారు.

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ వాయిస్ మారడానికి కారణం అదే.. గొంతుపై మానని గాయాలు..
Sai Dharam Tej
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 06, 2024 | 10:59 AM

మెగా కాంపౌండ్ నుంచి హీరోగా పరిచయమై తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి ధరమ్ తేజ్. సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే బైక్ యాక్సిడెంట్ జరిగి చాలా రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. మాదాపూర్‏లో తేజ్ బైక్ యాక్సిడెంట్ కావడంతో కొద్దిరోజులు కోమాలో ఉండిపోయాడు. ఆ తర్వాత ఆరోగ్యం కోలుకున్నాక కొన్నినెలలు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుని.. తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడిప్పుడే మునుపటిలా లైఫ్ కొనసాగిస్తున్నారు. విరూపాక్ష సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు తేజ్. ఇప్పుడు తన సినిమాలు, కంటెంట్ ఎంపికలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ప్రమాదం తర్వాత తేజ్ జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా తేజ్ వాయిస్ మారిపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇటీవల తెలుగు రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ్ తన లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. ఈ సమావేశంలో సాయి ధరమ్ తేజ్, శ్రుతి హాసన్, శ్రియా రెడ్డి, నిర్మాత శోభు యార్లగడ్డ, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ పాల్గొన్నారు.

ఇందులో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. తన జీవితంలో ఎదుర్కొన్న ఎత్తుపల్లాల గురించి పంచుకున్నారు. ముఖ్యంగా గతంలో జరిగిన యాక్సిడెంట్ గురించి గుర్తు తెచ్చుకున్నారు. జీవితంలో మిమ్మల్ని కిందకు నెట్టినా కూడా మళ్లీ పైకి లేపేందుకు మార్గం చూపుతుంది అని ఆయన పేర్కొన్నారు. చాలా కాలం తర్వాత విరూపాక్ష సినిమాతో హిట్ అందుకోవడం బాగుందా అని అడగ్గా.. “సినిమా సక్సెస్ కంటే యాక్సిడెంట్ జరిగి ఆసుపత్రిలో ఉన్నప్పుడు తన కోసం ప్రతీ ఒక్కరూ ప్రార్థించడం.. తన మీద ప్రేమ చూపించడమే ఎక్కువ సంతోషాన్ని ఇచ్చిందని.. వారి అభిమానాన్ని సంపాదిచడమే పెద్ద సక్సెస్ అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఆ ప్రేమను చూసే తనకు ఎక్కువ సంతోషం కలిగిందని అన్నాడు. అయితే ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అదే సమయంలో తేజ్ గొంతపై యాక్సిడెంట్ తాలుకూ గుర్తు కనిపిస్తుంది. దీంతో తేజ్ ఇంకా ఆ గాయంతో బాధపడుతున్నాడని.. అందుకే ఆయన ఒకప్పటిలా మాట్లాడేందుకు ఇబ్బందిపడుతున్నాడంటూ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే ఇంటర్వ్యూలో తన మామయ్య పవన్ కళ్యాణ్ తో తనకున్న బాండింగ్ గురించి చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ కు లెగో ఆడడమంటే చాలా ఇష్టమని.. తాను ఎప్పుడన్నా లెగో కొనుక్కుంటే తన మామకు కూడా ఒకటి కొనుక్కొని తీసుకెళ్లేవారని చెప్పారు. ఇక భారతీయ సినిమాలలో ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయని.. స్లో మోషన్ లో సీన్స్ ఇండియా సినిమాలకు ప్రత్యేక ఆకర్షణ అని అభిప్రాయాన్ని వెల్లడించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.