
అక్కినేని నాగచైతన్య హీరోగా డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన సినిమా తండేల్. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇందులో చైతూ సరసన సాయి పల్లవి నటించింది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో చైతూ, సాయి పల్లవి నటన, కెమిస్ట్రీపై ప్రశంసలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి దేవి శ్రీ అందించిన మ్యూజిక్ మరింత హైలెట్ అని చెప్పాలి. ఈ చిత్రంలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికే తండేల్ చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ వస్తుండగా.. తాజాగా ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు డైరెక్టర్ రాఘవేంద్ర రావు. తండేల్ సినిమాను చూసిన ఆయన తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ సిిమాకు తనకు చాలా నచ్చిందని అన్నారు. చాలా కాలం తర్వాత అద్భుతమైన ప్రేమకథను చూశానని అన్నారు.
“చాలా రోజులకు తండేల్ వంటి అద్భుతమైన ప్రేమకథను చూశాను. నాగచైతన్య, సాయి పల్లవి పోటీపడి నటించారు. చందు మొండేటి తీసుకున్న కథ.. దాని నేపథ్యం సాహసోపేతమే. షాట్ మేకింగ్ పై దర్శకుడి శ్రద్ధ బాగుంది. ఈ చిత్రంతో విజయాన్ని అందుకున్న గీతా ఆర్ట్స్ కు అభినందనలు. ఒక్క మాటలో ఇది ఒక దర్శకుడి సినిమా ” అంటూ రాసుకొచ్చారు. ఇక తమ సినిమాపై సీనియర్ దర్శకుడి ప్రశంసలు రావడంపై నాగచైతన్య సంతోషం వ్యక్తం చేశారు.
“థాంక్యూ సో మచ్ సర్.. మీ మాటలు నాకెంతో విలువైనవి. మీకు మా సినిమా నచ్చినందుకు సంతోషం” అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం రాఘవేంద్రరావు చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది. శ్రీకాకుళం జిల్లా డి.మత్య్సలేశం గ్రామానికి చెందిన పలువురు వేటకు వెళ్లగా పాకిస్తాన్ కోస్ట్ గార్డుకు చిక్కి రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన ఘనట ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి రెస్పాన్స్ వస్తుంది.
చాలా రోజులకు తండేల్ వంటి అద్భుతమైన ప్రేమకథ చూసాను. నాగ చైతన్య, సాయి పల్లవి పోటీ పడి నటించారు. చందు మొండేటి తీసుకున్న కథ దాని నేపధ్యం సాహసోపేతమే. షాట్ మేకింగ్ పై దర్శకుడు పెట్టిన శ్రద్ద బాగుంది. ఈ చిత్రంతో సక్సెస్ గీత ఆర్ట్స్ వారికి అభినందనలు. ఒక్క మాటలో ఇది ఒక దర్శకుడి సినిమా..! pic.twitter.com/wUNg1dZBAT
— Raghavendra Rao K (@Ragavendraraoba) February 8, 2025
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన