Raghavendra Rao: పాపం.. సీతను అలా వదిలేయకండి.. డైరెక్టర్ రాఘవేంద్రరావు స్పెషల్ రిక్వెస్ట్..
డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించిన సినిమా అన్నీ మంచి శకునములే. ఈ చిత్రాన్ని సీతారామం నిర్మాత స్వప్నదత్, ప్రియాంక దత్ నిర్మించారు. ఈ సినిమా లోని ఓ పాట విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సీతారామం 2 ప్లాన్ చేయాలని.. అందులో రామ్, సీతా కలవాలని కోరారు.
డైరెక్టర్ హనురాఘవపూడి తెరకెక్కించిన అద్భుతమైన ప్రేమకథా చిత్రమ్ సీతారామం. ఇందులో మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. గతేడాది ఆగస్టులో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 30 కోట్లు రాబట్టింది. ఈ సినిమాతో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది. ప్రేక్షకుల హృదయాలను దొచుకున్న ఈ సినిమాపై దర్శకుడు రాఘవేంద్రరావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. సీతను తలచుకుంటే ఇప్పటికీ తనకు కన్నీళ్లు వస్తాయని.. ఆమెను అలా వదిలేయకండి అంటూ ప్రొడ్యూసర్ స్వప్నదత్ కు స్పెషల్ రిక్వెస్ట్ చేశారు.
డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించిన సినిమా అన్నీ మంచి శకునములే. ఈ చిత్రాన్ని సీతారామం నిర్మాత స్వప్నదత్, ప్రియాంక దత్ నిర్మించారు. ఈ సినిమా లోని ఓ పాట విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సీతారామం 2 ప్లాన్ చేయాలని.. అందులో రామ్, సీతా కలవాలని కోరారు.
“అన్నీ మంచి శకునములే సినిమాలోని చేయి చేయి కలిపేద్దాం పాటను చూస్తుంటే నా పెళ్లి సందడిలోని పాట చూసినంత ఆనందంగా ఉంది. పెళ్లి సందడి ఎంతటి విజయాన్ని అందుకుందో ఈ సినిమా కూడా అంతే విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. స్వప్నా.. ఇప్పటికీ ‘సీతారామం’ సినిమాను మర్చిపోలేను. ఈ సినిమా విషయంలో నాకు ఒక బాధ ఉండిపోయింది. సీత ఏమైంది? ఆమె జీవితాన్ని అలా మిగల్చడం చాలా బాధగా ఉంది. నేను ఒక సలహా ఇస్తాను మీ దర్శకుడికి చెప్పు. రామ్ కోసం ఎంతో బాధపడుతున్న సీత ఒక తుపాకీ తీసుకుని విలన్ వద్దకు వెళ్లి.. అతడిని కాల్చాలనుకుంటుంది. అప్పుడు ఆమెకు రామ్ చావలేదని తెలుస్తుంది. అలా, రామ్-సీత అక్కడి నుంచి తప్పించుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టాక.. కుటుంబసభ్యులు వాళ్లను ఎలా ఇబ్బందులు పెట్టారు? ఇలా చూపిస్తే బాగుంటుంది. పాపం, ఆ సీతను అలా ఉంచొద్దు. సీతను తలచుకుంటే ఇప్పటికీ కన్నీళ్లు వస్తుంటాయి” అని రాఘవేంద్రరావు అన్నారు.