పూరీ జగన్నాథ్ న్యూమూవీ అప్‏డేట్.. ఈసారి కన్నడ స్టార్ హీరోతో ప్లాన్ చేస్తున్న మాస్ డైరెక్టర్..

Puri  Jagannath: పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో 'లైగర్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ సరసన

పూరీ జగన్నాథ్ న్యూమూవీ అప్‏డేట్.. ఈసారి కన్నడ స్టార్ హీరోతో ప్లాన్ చేస్తున్న మాస్ డైరెక్టర్..
Puri Jagannath
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 22, 2021 | 10:15 PM

Puri  Jagannath: పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘లైగర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో విజయ్ తల్లిగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటిస్తుంది. ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌, చార్మి ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మూంబైలో జరుగుతుంది. ఈ చిత్రం తెలుగు, హిందీతో పాటు తమిళం కన్నడ మాలయాళ బాషాల్లో సెప్టెంబర్‌ 9న విడుదల కానున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఇదిలా ఉంటే.. లైగర్ సినిమా విడుదల కాకముందే.. పూరీ మరో సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడట.. కానీ ఈసారి మాత్రం టాలీవుడ్ హీరోతో కాకుండా.. కన్నడ హీరోతో సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నాడట ఈ మాస్ డైరెక్టర్.

పూరీ జగన్నాథ్.. తన తదుపరి సినిమాను కన్నడ హీరో దృవ సర్జాతో తీయనున్నట్లుగా సమాచారం. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి.. దృవతో చర్చలు కూడా నడిపినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఈ విషయం గురించి పూరీటీం నుంచి ఎలాంటి స్పంధనలేదు. దృవ సర్జా.. సీనియర్ హీరో అర్జున్ మేనల్లుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఇటీవల పొగరు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. ఈ సినిమాలో దృవకు జోడీగా రష్మిక మందన నటించింది. కానీ ఈ మూవీ అనుకునంత సక్సెస్ కాలేకపోయింది. కానీ దృవ నటనకు మాత్రం మంచి మార్కులే వచ్చాయి. అటు.. విజయ్ లైగర్ సినిమా తర్వాత సుకుమార్, శివ నిర్వాణ దర్శకత్వాల్లో నటించనున్నారు.

Also Read:

త్రివిక్రమ్ గారి వల్లే ‘వకీల్ సాబ్’ ఛాన్స్.. కానీ ఆ సినిమా మిస్ అయ్యాను.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తమన్..

ఫుల్ జోష్ మీదున్న యంగ్ హీరో.. మరో ప్రాజెక్ట్‏కు ఓకే చెప్పిన ఆది.. త్వరలోనే సెట్స్ పైకి..

Priya Prakash Varrier: క్యూట్ క్యూట్‏గా కవ్విస్తున్న ప్రియా వారియర్..మలయాళీ భామ అందమైన ఫోటోలు..

ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..