త్రివిక్రమ్ గారి వల్లే ‘వకీల్ సాబ్’ ఛాన్స్.. కానీ ఆ సినిమా మిస్ అయ్యాను.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తమన్..

గతేడాది త్రివిక్రమ్.. స్టైలీష్ అల్లు అర్జున్ కాంబినేషన్‏లో అల.. వైకుంఠపురం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ఎస్ఎస్ తమన్.

త్రివిక్రమ్ గారి వల్లే 'వకీల్ సాబ్' ఛాన్స్.. కానీ ఆ సినిమా మిస్ అయ్యాను.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తమన్..
Ss Thaman
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 22, 2021 | 9:58 PM

గతేడాది త్రివిక్రమ్.. స్టైలీష్ అల్లు అర్జున్ కాంబినేషన్‏లో అల.. వైకుంఠపురం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ఎస్ఎస్ తమన్. ఈ సినిమా తర్వాత టాలీవుడ్‏లో వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా మారాడు. ఇటీవల పవన్ కళ్యాణ్ రీఎంట్రీగా వస్తున్న వకీల్ సాబ్ సినిమాకు కూడా సంగీతాన్ని అందించాడు.ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు చిత్రయూనిట్.. తాజాగా ఈ మూవీ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యాలు చేశాడు.

అల… వైకుంఠపురం సినిమాలోని పాటలు బాగా హిట్ అయ్యాయి. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన త్రివిక్రమ్, అల్లు అర్జున్‏లకు కృతజ్ఞతలు. ఈ సినిమా తర్వాత సోలో బ్రతుకే సో బెటర్.. క్రాక్ సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. గతంలో పవన్ కళ్యాణ్ గారికి జనసేన సాంగ్స్ చేశాను. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారితో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. నా కెరీర్ ప్రారంభంలోనే ఓ సంగీత దర్శకుడిగా మ్యూజికల్ సక్సెస్ వచ్చింది అంటే ఈ సినిమాతోనే. అయితే నాకు ముందుగా పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ ఛాన్స్ వచ్చినా నేను మిస్ అయ్యాను. కానీ ఇప్పుడు వకీల్ సాబ్ వచ్చింది. త్రివిక్రమ్ గారు నన్ను దిల్ రాజు గారికి పరిచయం చేయడం వల్లే ఈ ఛాన్స్ వచ్చింది. అయితే ఈ మూవీ ముందుగానే రావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ ప్రభావంతో కాస్తా లేట్ అయ్యింది. కానీ ఆలస్యం అయిన పర్లేదు.. మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. ఈ మూవీ స్టోరీ వినగానే.. నేను మగువా మగువా సాంగ్ చేశాడు. ఇది స్టోరీకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా హైలెట్ అవుతుందని భావించాం. ఈ మూవీకి ఎక్కడా కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా.. దిల్ రాజు గారు.. శ్రీరామ్ వేణుగారు.. చాలా బాగా తీశారు. వకీల్ సాబ్ సినిమాలోని సాంగ్స్ సందర్భాన్ని బట్టి విడుదల చేస్తాం. ఇందులో నివేదా థామస్, అంజలి, అనన్య నాగేళ్ళ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని బోనీకపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇందులో పవన్ సరసన శృతి హాసన్ నటిస్తుంది.

Also Read:

ఫుల్ జోష్ మీదున్న యంగ్ హీరో.. మరో ప్రాజెక్ట్‏కు ఓకే చెప్పిన ఆది.. త్వరలోనే సెట్స్ పైకి..

Priya Prakash Varrier: క్యూట్ క్యూట్‏గా కవ్విస్తున్న ప్రియా వారియర్..మలయాళీ భామ అందమైన ఫోటోలు..

ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..