ఫుల్ జోష్ మీదున్న యంగ్ హీరో.. మరో ప్రాజెక్ట్‏కు ఓకే చెప్పిన ఆది.. త్వరలోనే సెట్స్ పైకి..

విలక్షణ నటుడు.. డైలాగ్ కింగ్ సాయి కుమార్ వారసుడిగా టాలీవుడ్‏కు పరిచయమయ్యాడు ఆది సాయి కుమార్. ప్రేమ కావాలి

ఫుల్ జోష్ మీదున్న యంగ్ హీరో.. మరో ప్రాజెక్ట్‏కు ఓకే చెప్పిన ఆది.. త్వరలోనే సెట్స్ పైకి..
Adi Sai Kumar
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 22, 2021 | 9:39 PM

విలక్షణ నటుడు.. డైలాగ్ కింగ్ సాయి కుమార్ వారసుడిగా టాలీవుడ్‏కు పరిచయమయ్యాడు ఆది సాయి కుమార్. ప్రేమ కావాలి మొదటి సినిమాతోనే  విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు పొందడంతోపాటు ఆది మంచి పేరు సంపాదించాడు. 2011 లో దక్షిణాది ఫిలిం ఫేర్ అవార్డుల్లో ఉత్తమ నూతన నటుడిగా పురస్కారం అందుకున్నాడు. తరువాత బీ.జయ దర్శకత్వంలో వచ్చిన లవ్ లీ (2012) అనే సినిమాలో నటించాడు.  విభిన్న కథలను ఎంచుకుంటూ వస్తున్నా ఆది.. ఇటీవలే శశి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సంపాదించుకున్నాడు. తాజాగా ఈ హీరో మరో సినిమాగు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

ఆదిసాయికుమార్.. భాస్కర్ బంటుపల్లి దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అన్ని భాస్కర్ బంటుపల్లి అందిస్తుండగా.. ఇందులో ఆది సరికొత్త క్యారక్టరైజేషన్, స్టైలిష్ లుక్‏లో కనిపించబోతున్నాడట. ఈ సినిమాను శిఖర క్రియేషన్స్ బ్యానర్ పై టి. విజయ్ కుమార్ రెడ్డి సమర్పిస్తుండగా.. గుడివాడ యుగంధర్ నిర్మిస్తున్నారు. సాకేజ్ కొమండూరి సంగీతాన్ని అందిస్తున్నారు. ఎ.డీ. మార్గల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ మూవీని ఏప్రిల్ 13న ప్రారంభించనున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటిస్తామని చిత్రయూనిట్ తెలిపింది. మరీ ఈ సినిమాతో ఆది సూపర్ హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

Also Read:

Priya Prakash Varrier: క్యూట్ క్యూట్‏గా కవ్విస్తున్న ప్రియా వారియర్..మలయాళీ భామ అందమైన ఫోటోలు..

సేతుపతికి చేదు అనుభవం.. గొడవపడిన అభిమానులు.. చివరికి బైక్ పై అలా..

నా జీవితంలో అద్భుతమైన రోజు.. మీరు చెప్పిన మాటలను నేను మార్చిపోలేను.. బిగ్‏బాస్ విన్నర్ కామెంట్స్..