సేతుపతికి చేదు అనుభవం.. గొడవపడిన అభిమానులు.. చివరికి బైక్ పై అలా..

Vijay Sethupathi:  'ఉప్పెన' సినిమాతో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమాలో

సేతుపతికి చేదు అనుభవం.. గొడవపడిన అభిమానులు.. చివరికి బైక్ పై అలా..
Vijay Sethupathi
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 23, 2021 | 3:28 PM

Vijay Sethupathi:  ‘ఉప్పెన’ సినిమాతో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమాలో ఆయన చేసిన రాయనం పాత్రకు తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. విజయ్ హీరోగానే కాకుండా.. విలన్‏గా, సపోర్టింగ్ పాత్రలోనూ తన యాక్టివ్ పవర్‏ను చూపిస్తున్నాడు.  విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాలో సేతుపతి నెగిటివ్ షేడ్స్ ఉన్నపాత్రలో నటించి మెప్పించారు.  తాజాగా విజయ్‏కు నడిరోడ్డుపై చెదు అనుభవం ఎదురైంది. ఓ గొడవ కారణంగా.. అతడి బైక్ పై పారిపోవాల్సి వచ్చింది.

విజయ్ ప్రస్తుతం తన 46వ సినిమా షూటింగ్‏లో బిజీగా ఉన్నాడు.  ఈ సినిమాకు పోన్రామ్ దర్శకత్వం వహిస్తుండగా.. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్‏లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ రియాల్టీ స్టోరీ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతున్నట్లుగా సమాచారం.  ఈ మూవీలో కొన్ని సన్నివేశాలను ఓ రోడ్డుపై చిత్రీకరిస్తున్నారు.  ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఒక్కసారిగా అక్కడకు చేరుకున్నారు. భారీగా వస్తున్న అతని అభిమానులును అక్కడి సెక్యూరిటీ కంట్రోల్ చేయలేక పోయారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. అభిమానులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో విజయ్ తన కారు వద్దకు వెళ్ళే పరిస్థితి కూడా లేకపోయింది. చివరికి షూటింగ్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. అక్కడి పరిస్థితితో తన కారు వద్దకు వెళ్ళలేని విజయ్ సేతుపతి చిత్రయూనిట్ సభ్యుల్లో ఒక వ్యక్తి బైక్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. చిత్రయూనిట్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్ చేయలేదని అక్కడి ప్రభుత్వాధికారులు జరిమానా విధించారు.  ప్రస్తుతం విజయ్ సేతుపతి బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

Also Read:

నా జీవితంలో అద్భుతమైన రోజు.. మీరు చెప్పిన మాటలను నేను మార్చిపోలేను.. బిగ్‏బాస్ విన్నర్ కామెంట్స్..

‘ఇది కంఫర్ట్ జోన్ కాదు.. కానీ జీవితమంటేనే ఓ ప్రయోగం’.. కష్టాలను చెప్పుకుంటున్న రేణు దేశాయ్..