Puri Jagannadh: లైగర్‏లో విజయ్ పాత్రకు అల్లు అర్జున్‏కు మధ్య అసలు సంబంధమేంటీ ?.. ఆసక్తికర విషయాలు చెప్పిన పూరి..

తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ పూరిని ఇంటర్వ్యూ చేశాడు దర్శకుడు సుకుమార్. ఇందులో భాగంగా అసలు లైగర్ సినిమా ఆలోచన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆలోచన నుంచే పుట్టిందన్నారు పూరి.

Puri Jagannadh: లైగర్‏లో విజయ్ పాత్రకు అల్లు అర్జున్‏కు మధ్య అసలు సంబంధమేంటీ ?.. ఆసక్తికర విషయాలు చెప్పిన పూరి..
Puri Allu Arjun
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 24, 2022 | 4:04 PM

మాస్ అండ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం లైగర్ (Liger) ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా నటించిన ఈ మూవీపై ఇప్పటికే ఎక్కువగా అంచనాలున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్న ఆడియన్స్ ముందుకు రేపు (ఆగస్ట్ 25న) లైగర్ చిత్రం రాబోతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ పూరిని ఇంటర్వ్యూ చేశాడు దర్శకుడు సుకుమార్. ఇందులో భాగంగా అసలు లైగర్ సినిమా ఆలోచన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆలోచన నుంచే పుట్టిందన్నారు పూరి. బన్నీ చెప్పడం వల్లే తాను లైగర్ రోల్ డిజైన్ చేసినట్లు చెప్పారు.

లైగర్ ఆలోచన ఎలా మొదలైంది ? అని సుకుమార్ అడగ్గా.. పూరీ స్పందిస్తూ.. పదేళ్ల క్రితం ఇద్దరమ్మాయిలతో సినిమా చేస్తున్న సమయంలో బన్నీ ఒక హాలీవుడ్ డైరెక్టర్ గురించి చెప్పాడు. ఆ దర్శకుడు ఏ సినిమా చేసినా అందులో హీరోకి ఏదో ఒక లోపం ఉండేలా చూపిస్తాడు అలాంటి పాత్ర మీరు కూడా రాయొచ్చు కదా అని అడిగాడు. ఆ తర్వాత చాలా ఆలోచించాను. చెవుడు ఉన్నవాడిగా.. కళ్ళు లేనివాడిగా హీరో క్యారెక్టర్ బాగోదు. అందుకే నత్తితో ఇబ్బందిపడే హీరో పాత్రపై సినిమా రాస్తే ఎలా ఉంటుందని నేను అడిగాను. సూపర్ ఉంటుంది. రాయండి అని చెప్పాడు. అలా లైగర్ కథ మొదలైంది. ఈ ఐడియా వచ్చిందే బన్నీ వల్ల అంటూ చెప్పుకొచ్చారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సినిమా చేయాలని చాలాకాలంగా అనుకుంటున్నాను. కానీ బన్నీతో మాట్లాడిన తర్వాత నత్తి ప్లస్ ఎంఎంఏతో సినిమా రాశాను అని అన్నారు.

మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రాబోతున్న చిత్రంలో విజయ్ బాక్సర్‏గా కనిపించనున్నాడు. రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలలో నటిస్తుండగా.. ధర్మ ప్రొడక్షన్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు