AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara: నయనతార పై డైరెక్టర్ సీరియస్.. షూటింగ్‏కు ఇక రావొద్దని చెప్పిన పార్థిబన్..

ప్రస్తుతం ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్‏గా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోవడం కోసం నయన్ చాలా కష్టాలే పడింది. ఎన్నో అవమానాలను.. ఒడిదుడుకులను ఎదుర్కొంది నయన్. తమిళ్ స్టార్ శరత్‌కుమార్ నటించిన అయ్యా సినిమాతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. శరత్ కుమార్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన చంద్రముఖిలో నటించింది. ఈ సినిమా అటు తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ వరుస ఆఫర్స్ అందుకుంది నయన్.

Nayanthara: నయనతార పై డైరెక్టర్ సీరియస్.. షూటింగ్‏కు ఇక రావొద్దని చెప్పిన పార్థిబన్..
Nayanthara
Rajitha Chanti
|

Updated on: May 31, 2023 | 5:01 PM

Share

నయనతార.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఆమె లేడీ సూపర్ స్టార్. హీరోలతో సరిసమానంగా రెమ్యూనరేషన్ తీసుకునే ఏకైక హీరోయిన్. సినిమా ప్రమోషన్లకు.. ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటుంది.. అయినా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అడియన్స్‏ను అలరిస్తుంటుంది నయన్. ప్రస్తుతం బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న జవాన్ చిత్రంలో నటిస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్‏గా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోవడం కోసం నయన్ చాలా కష్టాలే పడింది. ఎన్నో అవమానాలను.. ఒడిదుడుకులను ఎదుర్కొంది నయన్. తమిళ్ స్టార్ శరత్‌కుమార్ నటించిన అయ్యా సినిమాతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. శరత్ కుమార్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన చంద్రముఖిలో నటించింది. ఈ సినిమా అటు తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ వరుస ఆఫర్స్ అందుకుంది నయన్.

ప్రస్తుతం అగ్రకథానాయికగా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నయనతారపై డైరెక్టర్ పార్థిబన్ సీరియస్ అయ్యాడట. ఇకపై ఆమె షూటింగ్ కు రావాల్సిన అవసరం లేదని చెప్పాడట. ఈ విషయాన్ని పార్థిబన్ స్వయంగా వెల్లడించారు. డైరెక్టర్ పార్థిబన్ తెరకెక్కించాల్సిన కొడైకుల్ మళై చిత్రంలో ఆమె కథనాయికిగా సెలక్ట్ చేశారట. అయితే ఈ సినిమా ఆడిషన్స్ కోసం ఉదయం 8 గంటలకు రమ్మని చెప్పగా.. ఆమె రాలేదట. అదే రోజు సాయంత్రం 8 గంటలకు కాల్ చేస్తే.. నిన్న రాత్రి బయలుదేరలేదు.. ఈరోజు రాత్రి బయలుదేరి బస్సులో వస్తానని చెప్పింది. దీంతో కోపంతో… ఇక నువ్వు రావొద్దు అని చెప్పానని అన్నారు పార్థిబన్.

ఇవి కూడా చదవండి

ఒకప్పుడు షూటింగ్స్ కోసం బస్సులో ప్రయాణించిన నయనతార ఇప్పుడు లేడీ సూపర్ స్టార్‏గా ఎదగడం నిజంగా ప్రశంసించాల్సిన విషయమన్నారు పార్థిబన్. నయన్ ఎదుగుదల చూసి చాలా సంతోషంగా ఉందన్నారు. ఆమెకు పనిపట్ల అపారమైన భక్తి.. శ్రద్ద ఉన్నాయన్నారు పార్థిబన్. ఆమెతో కలిసి నటించే ఛాన్స్ మిస్ చేసుకున్నానని అన్నారు.