The Warriorr: రామ్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామన్న స్టార్ దర్శకులు
ఎనర్జిటి స్టార్ రామ్ పోతినేని నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ది వారియర్. తమిళ్ దర్శకుడు లింగు స్వామి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు.

ఎనర్జిటి స్టార్ రామ్ పోతినేని నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ది వారియర్. తమిళ్ దర్శకుడు లింగు స్వామి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈ వెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ కు దర్శకుడు శంకర్, మణిరత్నం, భారతీరాజా తదితరులు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
శంకర్ మాట్లాడుతూ ..‘‘ది వారియర్.. చాలా మంచి టైటిల్. అందరం జీవితంలో ఏదో సాధించటానికి ఫైట్ చేస్తూనే ఉంటాం. కాబట్టి ఇది అందరికీ సూట్ అయ్యే టైటిల్. ఈ సినిమాలోని బుల్లెట్ సాంగ్ సహా అన్ని పాటలు బావున్నాయి. దేవిశ్రీ ప్రసాద్‌కి అభినందనలు. రామ్ కోసం ఈ సినిమా చూడబోతున్నాను. కృతి శెట్టి .. మంచి నటిగా ఎదిగి నేషనల్ అవార్డ్‌ను దక్కించుకోవాలని అనుకుంటున్నాను. లింగుసామి మంచి స్నేహితుడు. కరోనా సమయంలో నాకు చాలా సమస్యలు వచ్చాయి. తనతో చెప్పుకుంటే తను అండగా నిలబడ్డారు. అంత మంచి వ్యక్తి చేసిన ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. వారియర్ ట్రైలర్ చూశాను. చూస్తుంటే రామ్‌లో ఓ ఫైర్ కనిపించింది. వారియర్ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. అలాగే దర్శకుడు మణిరత్నం మాట్లాడుతూ.. ‘‘లింగుస్వామి ఈ సినిమా కోసం ఇంత మంది వారియర్స్‌ను తీసుకొస్తాడని తెలుసుంటే నా సినిమాకు సంబంధించిన వార్ సీన్స్‌ను ఇక్కడే చేసుండేవాడిని. లింగుస్వామి చాలా మంచి వ్యక్తి. కోవిడ్ సమయంలో ఇక్కడ అందరి డైరెక్టర్స్‌ను సంధానం చేశాడు. తన వల్ల నాకు ప్రతి ఒక డైరెక్టర్‌తో పర్సనల్‌గానూ మంచి అనుబంధం ఏర్పడింది. నేను నా పొన్నియన్ సెల్వన్‌ను హైదరాబాద్‌లో షూట్ చేస్తున్నప్పుడు లింగుస్వామి కూడా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఆయన తర్వగా పూర్తి చేసేశారు. ఆయన రోడ్ బాగా వేస్తే .. వెనకాలే నేను కూడా వచ్చేస్తాను. ది వారియర్ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.



