Samantha: సమంత ప్లాన్ వర్కవుట్ అయిందిగా.. ఇక తగ్గేదే లే..
ఎగ్జామ్ రాసినప్పటి కంటే.. దాని రిజల్ట్ అనుకున్నట్లు వచ్చినపుడే సంతోషంగా ఉంటుంది. తాజాగా సమంత ఇలాంటి ఎంజాయ్‌మెంట్‌లోనే ఉన్నారు. కొన్ని రోజులుగా గ్లామర్ డోస్ పెంచిన దానికి.. తగిన ఫలితం అందుతుంది.
ఎగ్జామ్ రాసినప్పటి కంటే.. దాని రిజల్ట్ అనుకున్నట్లు వచ్చినపుడే సంతోషంగా ఉంటుంది. తాజాగా సమంత ఇలాంటి ఎంజాయ్‌మెంట్‌లోనే ఉన్నారు. కొన్ని రోజులుగా గ్లామర్ డోస్ పెంచిన దానికి.. తగిన ఫలితం అందుతుంది.
1 / 10
ఏడాదిగా స్యామ్ వేసిన మాస్టర్ ప్లాన్ ఇప్పుడు వర్కవుట్ అయింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సమంత కేరాఫ్ అడ్రస్ కూడా మారిపోవడం ఖాయం. బాలీవుడ్‌లో జెండా పాతేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నారు మాజీ అక్కినేని కోడలు.
2 / 10
కొన్ని రోజులుగా సమంత గ్లామర్ షోకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. మరీ ముఖ్యంగా విడాకుల తర్వాత అమ్మడు సెన్సేషనల్ షోకు థర్మామీటర్లు పేలిపోతున్నాయి.
3 / 10
ఏమైంది సమంతకు.. ఎందుకింత రెచ్చిపోతుంది అంటూ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. అయితే దీని వెనక మాస్టర్ ప్లాన్ ఉంది.
4 / 10
అదిప్పుడు వర్కవుట్ అయింది. వరసగా బాలీవుడ్ నుంచి అవకాశాలు వెతుక్కుంటూ మరీ స్యామ్ చెంత చేరుతున్నాయి.
5 / 10
ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఖుషీ.. గుణశేఖర్ శాకుంతలం, యశోద సినిమాలతో బిజీగా ఉన్నారు సమంత. వీటితో పాటు బాలీవుడ్‌పై ఎక్కువగా ఫోకస్ చేసారు.
6 / 10
దీనికోసమే ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచడం కాదు.. థర్మామీటర్లు పేల్చేస్తున్నారు స్యామ్. ది ఫ్యామిలీ మ్యాన్ తర్వాత ముంబైలో సమంత పేరు బాగానే వినిపించింది.
7 / 10
ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో ఓ యాక్షన్ స్పై వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్ డికే దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఆయుష్మాన్ ఖురానా సినిమాతో సమంత బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.
8 / 10
ఇప్పటికే తాప్సీ ప్రొడక్షన్‌లో స్యామ్ సినిమా అనౌన్స్ అయింది. అయితే ముందుగా దినేష్ విజన్ దర్శకత్వంలో ఆయుష్మాన్ నటించబోయే సినిమాలోనే ఈమె పరిచయం కానున్నట్లు తెలుస్తుంది.
9 / 10
దీని తర్వాతే తాప్సీ సినిమా పట్టాలెక్కనుంది. మొత్తానికి అటు వెబ్ సిరీస్‌లతో పాటు.. ఇటు వరస సినిమాలు చేస్తూ బాలీవుడ్‌లో జెండా పాతాలని ఫిక్స్ అయిపోయారు సమంత.