Tollywood: దసరాను నమ్ముకున్న టాలీవుడ్‌.. బరిలోకి అగ్ర హీరోలు, ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్.. రూ. 200 కోట్ల మార్కెట్ సాధ్యమేనా.?

Tollywood: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కరోనా మహమ్మారి సినీ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. కొన్ని సినిమాలు సజావుగా థియేటర్ల ముందుకు వచ్చినా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. గడిచిన సంక్రాంతి సీజన్‌...

Tollywood: దసరాను నమ్ముకున్న టాలీవుడ్‌.. బరిలోకి అగ్ర హీరోలు, ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్.. రూ. 200 కోట్ల మార్కెట్ సాధ్యమేనా.?
Narender Vaitla

|

Jul 07, 2022 | 7:32 PM

Tollywood: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కరోనా మహమ్మారి సినీ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. కొన్ని సినిమాలు సజావుగా థియేటర్ల ముందుకు వచ్చినా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. గడిచిన సంక్రాంతి సీజన్‌ కరోనాకు బలైపోయింది. సమ్మర్ సీజన్ అంతంతమాత్రంగానే గడిచింది.. ఈ మధ్య వచ్చిన సినిమాల సంగతి సరేసరి.. మరి కనీసం దసరా సీజన్ అయినా టాలీవుడ్‌కు కలిసొస్తుందా..? స్టార్ హీరోలు మ్యాజిక్ చేస్తారా..? విజయదశమికి విజయదుందుభి మోగిస్తారా..? అన్న ఆసక్తి అటు ఇండస్ట్రీతో పాటు ఇటు ప్రేక్షకుల్లోనూ ఉంది. అయితే దసరాకు విడుదలవుతోన్న కొన్ని సినిమాలు ఇండస్ట్రీలో ఆశలు చిగురించేలా చేస్తున్నాయి..

ట్రిపులార్‌ ఒక్క సినిమా లేకపోయుంటే ఈ ఏడాది టాలీవుడ్ పరిస్థితి చాలా దారుణంగా ఉండేదేమో..? డిజే టిల్లు, మేజర్ లాంటి చిన్న సినిమాలు మినహాయిస్తే.. పెద్ద సినిమాలేవీ బ్లాక్‌బస్టర్ కాలేదు. స్టార్స్ వచ్చినా ఓపెనింగ్స్‌తో సరిపెట్టుకున్నారు. అలా సంక్రాంతి నుంచి సమ్మర్ వరకు అన్ని సీజన్స్ ఏదో అలా గడిచిపోయాయంతే. దాంతో అందరి కళ్లు ఇప్పుడు దసరాపైనే ఉన్నాయి. ఇప్పటికే చిరంజీవి పండక్కి వస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. మోహన్ రాజా తెరకెక్కిస్తున్న గాడ్ ఫాదర్ దసరాకు రానున్నట్లు అనౌన్స్‌ చేశారు. లూసీఫర్ రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. దీంతో సినిమాకు ఏమాత్రం పాజిటివ్‌ టాక్‌ వచ్చినా రూ. 100 కోట్లు రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు బాలయ్య, గోపీచంద్ మలినేని సినిమా దసరాకే రాబోతుంది. అధికారికంగా కన్ఫర్మ్ చేయకపోయినా.. ఈ సినిమా పండక్కి రావడం దాదాపు ఖాయమైపోయింది. దీని బిజినెస్ కూడా 60 కోట్ల వరకు జరుగుతుంది.

అటు చిరు.. ఇటు బాలయ్య రానుండటంతో దసరాకు బాక్సాఫీస్ దగ్గర హీట్ పెరగనుంది. ఈ ఇద్దరు స్టార్స్‌కు తోడు నాచురల్ స్టార్ నాని తానున్నానంటూ దసరా సినిమాతోనే రానున్నారు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వరస ఫ్లాపుల్లో ఉన్న నానికి దసరా విజయం కీలకంగా మారింది. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్. తెలంగాణ నేపథ్యంలో రానున్న దసరా సినిమాకు దాదాపు 50 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్లు తెలుస్తుంది. బిజినెస్ కూడా భారీగానే జరుగుతుంది.

దసరాకు తెలుగు సినిమాలతో పాటు తమిళం నుంచి భారీ చారిత్రాత్మక చిత్రం రానుంది. అదే మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియన్ సెల్వన్. చోళుల కాలం నాటి కథతో వస్తున్న ఈ సినిమాలో విక్రమ్, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్యారాయ్ లాంటి భారీ తారాగణం ఉంది. రెండు భాగాలుగా రానున్న పొన్నియన్ సెల్వన్ కోసం 300 కోట్లకు పైగానే ఖర్చు పెడుతున్నారు. సెప్టెంబర్ 30న విడుదల కానుంది ఈ చిత్రం. ఈ 4 సినిమాలు కలిపి దాదాపు 200 కోట్లకు పైగా బిజినెస్ చేయనున్నాయి. మరి దసరా సీజన్‌ అయినా టాలీవుడ్‌కు మంచి రోజులు తెచ్చి పెడుతుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి…

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu