AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ప్రభాస్ పై డైరెక్టర్ కృష్ణవంశీ ఆసక్తికర కామెంట్స్.. 20 ఏళ్ల తర్వాతా అదే పరిస్థితి..

డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సినిమా చక్రం. అప్పట్లో ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద మిక్డ్స్ టాక్ వచ్చింది. కానీ ఈ సినిమాలోని సాంగ్స్ మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా మరోసారి ప్రభాస్ తో సినిమా గురించి డైరెక్టర్ కృష్ణవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Prabhas: ప్రభాస్ పై డైరెక్టర్ కృష్ణవంశీ ఆసక్తికర కామెంట్స్.. 20 ఏళ్ల తర్వాతా అదే పరిస్థితి..
Krishnavamsi, Prabhas
Rajitha Chanti
|

Updated on: Oct 17, 2024 | 8:19 AM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే కల్కి 2898 ఏడీ చిత్రంలో బాక్సాఫీస్ షేక్ చేసిన ప్రభాస్.. ఇప్పుడు రాజాసాబ్ మూవీ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అలాగే డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇవే కాకుండా స్పిరిట్, సలార్ 2, కల్కి 2 సినిమాలు ఇంకా పట్టాలెక్కాల్సి ఉంది. ప్రభాస్ ప్రాజెక్ట్స్ అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరికొన్ని రోజుల్లో డార్లింగ్ బర్త్ డే రానుండడంతో తన నెక్ట్స్ సినిమాల అప్డేట్స్ పై భారీ హైప్ నెలకొంది. ఇదిలా ఉంటే డార్లింగ్ మంచి నటుడని.. కానీ ఆందరూ ఆయనను యాక్షన్ నేపథ్య సినిమాలకే పరిమితం చేస్తున్నారు అన్నారు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. గతంలో సూపర్ హిట్ అయిన ఖడ్గం సినిమా రీరిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ప్రభాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

సెన్సిటివ్ మూవీ చక్రంలో ప్రభాస్ నటించేందుకు ఎలా ఒప్పించారు ? అని అడగ్గా.. కృష్ణవంశీ స్పందిస్తూ..”పని పట్ల ప్రభాస్ అంకిత భావంతో ఉంటాడు. మంచి పెర్ఫామర్. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీ ఆయనను సరిగ్గా వినియోగించుకోవడం లేదు. కేవలం ఫైట్లకే అతడిని పరిమితం చేస్తున్నారు. చక్రం సినిమాతోపాటు అదే సమయంలో వేరే యాక్షన్ ఓరియెంటెడ్ స్టోరీ చెప్పాను.. అందరూ యాక్షన్ కథలే చెబుతున్నారంటూ చక్రం సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు ఆయన. 20 ఏళ్ల తర్వాత కూడా పరిస్థితి మారలేదు. ఇప్పటికీ అతడిని దర్శకులంతా యాక్షన్ కథలకే పరిమితం చేస్తున్నారు. గంతలో నేను చెప్పిన సబ్జెక్టుతో ఇప్పుడు సినిమా తీయొచ్చు. కానీ ప్రభాస్ ఇప్పుడు ఫుల్ బిజీ. నేనేమో అనుకున్న వెంటనే సినిమా తీయాలనుకుంటాను. ఇతర ప్రాజెక్ట్స్ పక్కన పెట్టి నా సినిమా చేయండి అని చెప్పలేను కదా” అని అన్నారు. దీంతో కృష్ణవంశీ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

నిన్నే పెళ్లాడతా సినిమాను నాగ చైతన్యతో రీక్రియేట్ చేసే అవకాశం ఉందా ? అని అడగ్గా.. ఆ సినిమాను ఎవరితోనూ మరోసారి తెరకెక్కించలేమని.. చైతన్య శైలికి తగ్గట్టు కొత్త సినిమా రూపొందించాలి గానీ ఉన్నదాన్నే మళ్లీ తీయడం ఎందుకు ? అని అన్నారు. డైరెక్టర్ కృష్ణవంశి తెరకెక్కించిన ఖడ్గం చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా 2002లో విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని రేపు మరోసారి అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us