Bigg Boss 8 Telugu: విష్ణుప్రియ మాటలకు గంగవ్వ కన్నీళ్లు.. టాస్కులు ఆడి బొక్కలు ఇరగ్గొట్టుకోను.. మైండ్ గేమ్ అంటోన్న మణికంఠ..

పాత టాస్కునే మళ్లీ పెట్టాడు బిగ్‌బాస్. గతంలో సీజన్ 4లో పెట్టిన బ్యాటరీ టాస్కును కాస్త మార్చి మళ్లీ ఆడించాడు. ఓజీ, రాయల్ క్లాన్స్ ను రెండు టీంలుగా విడగొట్టి బ్యాటరీ టాస్కు ఇచ్చాడు. మరోవైపు తన మనసులోని బాధను విష్ణు బయటపెట్టడంతో గంగవ్వ కన్నీళ్లు పెట్టుకుంది.

Bigg Boss 8 Telugu: విష్ణుప్రియ మాటలకు గంగవ్వ కన్నీళ్లు.. టాస్కులు ఆడి బొక్కలు ఇరగ్గొట్టుకోను.. మైండ్ గేమ్ అంటోన్న మణికంఠ..
Bigg Boss 8 Telugu
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 17, 2024 | 6:41 AM

బిగ్‏బాస్ సీజన్ 8 ఏడో వారం నామినేషన్స్ ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది. ఇక తన మనసులోని బాధను విష్ణుప్రియ పంచుకోవడంతో కన్నీళ్లు పెట్టుకుంది గంగవ్వ. అమ్మకు ఇష్టంలేదని చిన్నప్పటి నుంచి నాన్నతో మాట్లాడేవాళ్లం కాదని.. నాన్నపై ఎంత ప్రేమ ఉన్నా.. అమ్మ కోసం ఆయనతో మాట్లాడలేదని.. చిన్నప్పుడు ఇద్దరూ విడిపోయారని.. ఇది ఎవరికీ జరగకూడదు.. అమ్మ చనిపోయాక ఇప్పుడిప్పుడే ఆయనతో మాట్లాడుతున్నాము అంటూ విష్ణుప్రియ చెప్పుకొచ్చింది. దీంతో గంగవ్వ ఎమోషనలైంది. గతవారం ఇన్ఫినిటీ రూంకు వెళ్లిన నబీల్ అన్ లిమిటెడ్ ఫుడ్ కావాలని అడిగిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడే ఓ తిరకాసు పెట్టాడు. ఇంట్లో ఉన్నంతకాలం నబీల్ స్వీట్లు, కూల్ డ్రింగ్స్, చాక్లెట్స్ త్యాగం చేస్తే ఈ ఒక్కవారం అన్ లిమిటెడ్ రేషన్ ఇస్తానని చెప్పాడు. దీంతో నబీల్ ఆ కండిషన్ కు ఒకే చెప్పగా.. హౌస్మేట్స్ మొత్తానికి అన్ లిమిటెడ్ రేషన్ వచ్చింది.

ఆ తర్వాత తాను నామినేషన్స్ నుంచి సేవ్ అయితే గంగవ్వకు బంగారు ముక్కుపుడక ఇస్తానని అన్నాడు మణికంఠ. ప్రతి వారం సేవ్ అయితే అరతులం ఇస్తానంటూ గంగవ్వ మీద ఒట్టేశాడు. ఇక ఆ తర్వాత నామినేషన్స్ రీక్రియేట్ చేసి నవ్వించారు అవినాష్, రోహిణి. వీరిద్దరి కామెడీ మెచ్చిన బిగ్ బాస్ కిచెన్ లో మరో రెండు గంటలు ఎక్కువ సేపు వంట చేసుకునే ఛాన్స్ ఇచ్చాడు. రాయల్ టీంను ఓవర్ స్మార్ట్ ఫోన్లుగా, ఓజీ టీంను ఓవర్ స్మార్ట్ చార్జర్లుగా విభిజించారు. హౌస్ అంతా రాయల్ టీం ఆధీనంలో ఉంటుందని.. కేవలం గార్డెన్ ఏరియా మాత్రమే ఓజీ టీమ్ ఆధీనంలో ఉంటుందని చెప్పాడు. కిచెన్, బెడ్ రూమ్, వాష్ రూమ్ వంటి వసతులు అందిస్తూ ఛార్జింగ్ పొందవచ్చు అని చెప్పాడు. ఇక టాస్కు పూర్తయ్యేలోపు బతికున్న సభ్యులే మెగా చీఫ్ కంటెండర్స్ అని తెలిపాడు. టాస్కులు ఆడి బొక్కలిరగొట్టుకుని బయటకు వెళ్లలేను. నాకంటూ ఫ్యామిలీ ఉందని అని చెప్పాడు మణికంఠ. హరితేజ చెప్పిన హరికథకు ఇంప్రెస్ అయ్యి ఒక్క నిమిషం ఛార్జ్ ఇచ్చాడు. దీంతో హరితేజకు ఒక్క పాయింట్ పెరిగింది.

నబీల్ ఆదమరిచి కూర్చుని ఉండగా.. ఛార్జర్ కనెక్ట్ చేశాడు అవినాష్. ఒక్క నిమిషం కూడా లేకపోవడంతో అది కౌంట్ చేయలేదు బిగ్ బాస్. యష్మీ దగ్గర ఛార్జ్ తీసుకోవాలని ట్రై చేసిన నయనిని ఆమె కిందపడేసింది. దీంతో ఓజీ క్లాన్ మొత్తం నయనిపై అటాక్ చేయడంతో ఆమె ముఖంపై గీసుకుపోయింది. దీంతో నయని కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ఇదే టాస్కు నేటి ఎపిసోడ్ లోనూ కంటిన్యూ కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.