Brahmamudi, October 17th Episode: నిజం తెలుసుకున్న రాజ్.. జీవితంలో కళావతిని నమ్మను..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్యని ఒప్పించి దాంపత్య వ్రతంలో కూర్చోవాలని కనకం అడుగుతుంది. నా వల్ల కాదు.. నేను తనని ఒప్పించ లేనని అంటాడు రాజ్. నిజమే బాబు మీరు మాత్రం ఏం చేస్తారు? ఈ జన్మకు నాకు ఈ అదృష్టం లేదు. ముగ్గురు కూతుళ్లు.. ముగ్గురు అల్లుళ్ళతో కలిసి దాంపత్య వ్రతం చేసుకుంటూ ఉంటే కళ్లారా చూసి కన్ను మూయాలని కోరిక. కళ్ల ముందే కల కలగా మారిపోతే.. ఏమీ మోయలేని పరిస్థితిలో ఉన్నా..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్యని ఒప్పించి దాంపత్య వ్రతంలో కూర్చోవాలని కనకం అడుగుతుంది. నా వల్ల కాదు.. నేను తనని ఒప్పించ లేనని అంటాడు రాజ్. నిజమే బాబు మీరు మాత్రం ఏం చేస్తారు? ఈ జన్మకు నాకు ఈ అదృష్టం లేదు. ముగ్గురు కూతుళ్లు.. ముగ్గురు అల్లుళ్ళతో కలిసి దాంపత్య వ్రతం చేసుకుంటూ ఉంటే కళ్లారా చూసి కన్ను మూయాలని కోరిక. కళ్ల ముందే కల కలగా మారిపోతే.. ఏమీ మోయలేని పరిస్థితిలో ఉన్నా.. పర్వాలేదని కనకం అంటుంది. దీంతో రాజ్ కరిగిపోయి.. నేను చూసుకుంటాను.. నేను ఒప్పిస్తానని రాజ్ అంటాడు. దీంత కనకం సంతోష పడుతుంది. రాజ్ కావ్యని వెతుకుతూ ఉంటాడు. అప్పుడే అపర్ణ రాజ్‌ని పిలిచి.. దాంపత్య వ్రతానికి కూర్చోరా అని అంటుంది. కానీ ఆ కళావతి నిలబడటానికి కూడా ఒప్పుకోవడం లేదని రాజ్ అంటాడు. పాపం కావ్య అమాయకురాలు రా.. తల్లికి క్యాన్సర్ అని తెలియక ఒప్పుకోవడం లేదు. తెలిస్తే కావ్య గుండె ఏం అవుతుందోనని ఇందిరా దేవి అంటుంది.
కావ్యని ఒప్పించడానికి రాజ్ కష్టాలు..
నువ్వు ఏమైనా చేయి.. కావ్యని వ్రతానికి ఒప్పించమని అపర్ణ అంటే.. అవును మమ్మీ నేను మాట ఇచ్చినప్పుడు.. ఆవిడ కళ్లలో ఆనందం కనిపించింది. ఏదో ఒకటి చేసి ఒప్పిస్తానని రాజ్ అంటాడు. కావ్య దగ్గరకు వెళ్లి.. నీతో మాట్లాడాలి రా అని పక్కకు తీసుకెళ్తాడు రాజ్. రాజ్, కావ్యలు మాట్లాడేది అంతా అపర్ణ, ఇందిరా దేవి, కనకాలు పక్కన ఉన్న కిటికీలో నుంచి చూస్తారు. గుడిలో నా చేయి తగిలితే తేల్లు, జెర్రులు పాకుతున్నాయి అన్నారు కదా ఇప్పుడు ఎందుకు నా చేయి పట్టున్నారని కావ్య అంటే.. వసు దేవుడు అంతటి వాడే గాడిద కాళ్లు పట్టుకున్నాడని రాజ్ అంటాడు. మీరు ఏం అన్నారో అర్థమైంది నేను వెళ్తున్నానని కావ్య అంటే.. తిక్కల్దానా ఆగవే.. చూడు ఇవన్నీ కాదు.. నీకూ నాకు మధ్య ఉంటే ఆ తర్వాత చూసుకుందామని రాజ్ అంటే.. ఎక్కడికి ఆ బూత్ బంగ్లాకే కదా అని కావ్య అంటుంది. సరే ఇప్పుడు దాంపత్య వ్రతానికి వచ్చి కూర్చొంటావా లేదా? అని రాజ్ అడిగితే.. నాకూ మీకు ఏ సంబంధం లేదని మీరే కదా చెప్పారని కావ్య అంటుంది.
నా భార్యగా పీటల మీద కూర్చో..
నువ్వు పాతవి అన్నీ తవ్వకు. ఈ వ్రతం నా కోసం కాదు మీ అమ్మ కోసమని రాజ్ అంటాడు. కట్ట బట్టలతో అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చినప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో తెలిసి కూడా మా అమ్మ అలా ఎలా అందో నేనే అడుగుతాను. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? మీ ఉద్దేశం ఏంటి? మీరు నాకు చెప్పమని కావ్య అంటుంది. ఇప్పుడు నేను ఏమీ చేయలేనని రాజ్ అంటే.. నాకు క్లారిటీ లేకుండా నేను ఏమీ చేయలేనని కావ్య అంటుంది. ఓసేయ్ అసలు మీ అమ్మకి అని రాజ్ అంటే.. ఏంటి మీ అమ్మ.. మా అమ్మకు ఏమైంది.. ఇవన్నీ మా అమ్మ కోసం చేస్తున్నారా అని కావ్య అడిగితే.. రాజ్ ఆలోచించుకుని మీ అమ్మకు ఏమైంది రుబ్బురోల్లా శుభ్రంగా ఉందని అంటాడు. ఈ ఒక్కసారికి అన్నీ దులిపేసుకుని రా.. ఆ తర్వాత దులిపేసుకునే అవసరం రాదు. ఆ తర్వాత నా హృదయం ఎంత విశాలమైనదో అర్థమవుతుందని చెప్తాడు. నీకు పుణ్యం ఉంటుంది.. వచ్చి కూర్చోమని రాజ్ దణ్ణం పెట్టి అడిగితే.. ఏ స్థానంలో కూర్చోవాలి? మీ భార్యగానా.. కనకం కూతురుగానా అని కావ్య అంటే.. నా భార్య స్థానంలో కూర్చో. నేను అన్నీ మర్చిపోయి పిలుస్తాన్నా.. నేనొచ్చి పీటల మీద కూర్చుంటున్నా.. నువ్వు వస్తావో రావో అది నీ ఇష్టమని రాజ్ చెప్పేసి వెళ్తాడు.
రుద్రాణికి తెలిసిపోయిన నిజం..
ఆ తర్వాత అప్పూ గదిలో రెడీ అవుతుంది. బంటీ అప్పుడే వచ్చి అమ్మో ఇన్ని తెలివి తేటా.. బావను దెబ్బకు దారిలోకి తీసుకొచ్చింది. కావ్య అక్కని, రాజ్ బావని కలిపేసిందని బంటీ అంటాడు. రేయ్ బంటీ ఏంట్రా నువ్వు అనేది అని అడుగుతుంది. అప్పుడే రుద్రాణి అటుగా వెళ్తు.. కిటికీ నుంచి అప్పూ, బంటీలు మాట్లాడుకునేది మాట్లాడేస్తుంది. రేయ్ ఆ నిజం ఏంటో చెప్పు అని అప్పూ బెదిరిస్తుంది. మర్యాదగా మా అమ్మ ఏం చేసిందో.. మర్యదగా చెప్పమని అడుగుతుంది. కావ్య అక్కని, రాజ్ బావని కలపడానికి తనకు క్యాన్సర్ అని త్వరలోనే చనిపోతుందని అబద్ధం చెప్పింది. దీంతో రాజ్ బావ ఈ పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నాడని బంటీ చెబుతుంది. రేయ్ అమ్మ ఇంత పెద్ద నాటకం ఆడుతుందా.. బావకు తెలిస్తే పెద్ద నాటకం ఆడుతుందని పెద్ద గొడవ అవుతుందని అప్పూ అంటుంది. ఈ నిజం విన్న రుద్రాణి ఎంతో సంతోష పడుతుంది.
జీవితంలో కళావతిని నమ్మను..
అప్పూ, స్వప్నలు జంటగా పీటల మీద కూర్చొంటారు. రాజ్ కూడా కూర్చొంటాడు. కావ్య వస్తుందో రాదో తెలియక అందరూ ఎదురు చూస్తారు. అప్పుడే కావ్య వస్తుంది. అందరూ సంతోషిస్తారు. పూజ ప్రారంభం అవుతుంది. కావ్య చేతికి కంకణం కట్టే సమయానికి రుద్రాణి శభాష్ అంటూ చప్పట్లు కొడుతుంది. నీకో నిజం చెప్పబోతున్నా.. నువ్వు ఎలా నమ్మావో.. ఇది అంతా విని ఎలా ఫూల్స్ అయ్యామో బయట పెట్టబోతున్నా అని రుద్రాణి అంటుంది. దీంతో రుద్రాణి గారు అని కావ్య అంటే.. మీ అమ్మ కంటే నీ కంటే నేను తెలివైన దాన్ని అని రుద్రాణి అంటుంది. మధ్యలో అపర్ణ, పెద్దావిడలు అడ్డుకున్నా.. రుద్రాణి వినిపించుకోదు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో నిజం తెలుసుకున్న రాజ్.. నా జీవితంలో కళావతిని, ఈ ఇంటి మనుషులను చచ్చినా నమ్మను అని అంటాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..