Anchor Pradeep: ఎట్టకేలకు శుభవార్త చెప్పిన స్టార్ యాంకర్.. దీపికా పిల్లితో ఉన్న ఫొటోతో సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్రదీప్
బుల్లితెరపై స్టార్ యాంకర్ గా ఎప్పుడూ గల గలా మాట్లాడుతూ వినోదం అందించే స్టార్ యాంకర్ ఇటీవల బాగా సైలెంట్ అయిపోయాడు. ఏ టీవీ షోలోనూ కనిపించడం లేదు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండడం లేదు. దీంతో ప్రదీప్ కు ఏమైందోనని అతని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు గురించి తెలుగు ఆడియెన్స్‌కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన పంచులు, ప్రాసలు, జోకులతో పలు టీవీ షోలను సక్సెస్ ఫుల్ గా రన్ చేశారాయన. ఇక పలు సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించారు. అలాగే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగానూ మారిపోయాడు. ఇందులోని పాటలు సూపర్ హిట్ గా నిలిచినా మూవీ మాత్రం ఆ రేంజ్ లో మెప్పించలేకపోయింది. అయితే ఏమైందో తెలియదు కానీ గత కొన్ని రోజులుగా ప్రదీప్ ఏ టీవీ షోలోనూ కనిపించడం లేదు. సినిమాల్లోనూ సందడి లేదు. సోషల్ మీడియాలోనూ ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వడం లేదు. దీంతో అతని అభిమానులు ఆందోళన చెందతున్నారు. ప్రదీప్ కు ఏమైందంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్ ను పలకరించాడీ స్టార్ యాంకర్. అంతేకాదు ఓ సర్ ప్రైజ్ కూడా ఇచ్చాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా తర్వాత హీరోగా తన రెండో సినిమాను అనౌన్స్ చేశాడు. సోషల్ మీడియా ద్వారా తన కొత్త సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను పంచుకున్నాడు.
కాగా తన రెండో సినిమాకు ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా టైటిల్ ను పెట్టుకున్నాడు ప్రదీప్. పవన్ మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ పేరునే తన రెండో సినిమా టైటిల్ గా పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా జబర్దస్త్ ఫేమ్, ప్రముఖ యాంకర్ దీపికా పిల్లి నటిస్తుండడం మరో విశేషం. తాజాగా విడుదలైన పోస్టర్ లో హీరో హీరోయిన్లు ఒకరినొకరు చూసుకుంటూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ఇక మోషన్ పోస్టర్ లో ఓ వైపు అందమైన ఊరు, మరోవైపు ఆయుధాలు చేత బట్టిన గ్రామస్థులు, క్లాస్ రూంలో ప్రదీప్, ఇంట్లో హీరోయిన్ కనిపిస్తున్న విజువల్స్ అభిమానులను థ్రిల్ కు గురి చేశాయి. మోంక్స్ అండ్ మంకీస్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానిక ఇఏ రాధన్ సంగీతం అందిస్తున్నాడు. నితిన్ – భరత్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.
పవన్ కల్యాణ్ సినిమా టైటిల్ తో..
With lots of Hope & lots of Love ❤️ This one is close to my heart 🥹 To entertain you all🤗….in theatres soon #AAIA #PradeepMachiraju2 is #AkkadaAmmayiIkkadaAbbayi / #అక్కడఅమ్మాయిఇక్కడఅబ్బాయి ❤️🔥
Pairing soon in theatres🫶#AAIA@impradeepmachi… pic.twitter.com/VQxNMHHlON
— Pradeep Machiraju (@impradeepmachi) October 17, 2024
‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా మోషన్ పోస్టర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.