Salman Khan: సల్మాన్ ఖాన్ హత్యకు ప్లాన్.. బిష్ణోయ్ గ్యాంగ్ షూటర్ అరెస్ట్..

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ వ్యక్తిని హరియాణాలోని పాని పట్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిని గురువారం ముంబై కోర్టులో హాజరుపర్చనున్నారు.

Salman Khan: సల్మాన్ ఖాన్ హత్యకు ప్లాన్.. బిష్ణోయ్ గ్యాంగ్ షూటర్ అరెస్ట్..
Salman Khan
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 17, 2024 | 1:37 PM

ముంబైలో బిష్ణోయ్ వర్గం కలకలం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే బాబా సిద్ధిఖీ హత్య తర్వాత పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు. ముఖ్యంగా బిష్ణోయ్ వర్గం మెయిన్ టార్గెట్ అయిన సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే సల్మాన్ ఇంటి వద్ద ఫోటోగ్రాఫ్స్, సెల్ఫీలకు అనుమతి నిరాకరించారు. అలాగే సల్మాన్ కూడా ఎవరిని కలవకూడదని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సల్మాన్ హత్యకు ప్లాన్ చేసిన గ్యాంగులో సుఖ అనే షార్ట్ షూటర్ ను నవీ ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని పానిపట్‌లో సుఖాను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు ధృవీకరించారు. ఈరోజు అతడిని ముంబైలోని కోర్టులో హజరుపరచనున్నారు. సుఖా బిష్ణోయ్ గ్యాంగ్ షూటర్ అని భావిస్తున్నారు. జూన్‌లో, పన్వెల్‌లోని అతని ఫామ్‌హౌస్ సమీపంలో సల్మాన్‌ను లక్ష్యంగా చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.

ఏప్రిల్ నెలలో, బాంద్రాలోని సల్మాన్ ‘గెలాక్సీ అపార్ట్‌మెంట్స్’ బయట ఇద్దరు నిందితులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటన వెనుక గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉందన్న అనుమానాన్ని సల్మాన్ పోలీసులకు వ్యక్తం చేశాడు. బిష్ణోయ్ వర్గం నుంచి సల్మాన్ ఖాన్ తోపాటు అతడి కుటుంబానికి బెదిరింపులు వచ్చాయి. సల్మాన్ ఇంటి బయట కాల్పుల కేసులో ముంబై పోలీసులు కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌లో సల్మాన్ వాంగ్మూలం కూడా ఉంది. జనవరిలో కూడా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ గుర్తింపు కార్డులు చూపించి తన పన్వెల్ ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని సల్మాన్ చెప్పారు. 2022లో బాంద్రాలోని సల్మాన్ భవనం బెదిరింపు లేఖను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సల్మాన్ ఖాన్ కదలికలపై నిఘా పెట్టేందుకు లారెన్స్ బిష్ణోయ్, సంపత్ నెహ్రా గ్యాంగ్ దాదాపు 60 నుంచి 70 మందిని నియమించినట్లు పోలీసులు తెలిపారు. వారంతా బాంద్రాలోని సల్మాన్ ఇల్లు, పన్వెల్ ఫామ్‌హౌస్ సినిమా సెట్‌లపై దృష్టి సారించారు. దీనిపై పక్కా సమాచారం అందడంతో ఏప్రిల్ 24న పన్వెల్ సిటీ పోలీస్ స్టేషన్‌లో కొంతమందిపై కేసు నమోదు చేశారు.

ఇది చదవండి : Devara Movie: సోషల్ మీడియాకే చెమటలు పట్టిస్తోన్న ‘దేవర’ సిన్నది.. బ్లాక్ శారీలో మైండ్ బ్లాంక్ చేస్తోందిగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.