K Viswanath: దర్శకుడు విశ్వానాథ్ కెరీర్లో ఓ మైలురాయి.. కానీ ఆ సినిమానే మానసికంగా బాధపెట్టిందట..
సప్తపది, స్వాతిముత్యం, స్వయం కృషి, శుభోదయం, శుభలేఖ, అపద్భాంధవుడు, శుభసంకల్పం వంటి అద్భుతమైన చిత్రాలను రూపొందించి కళాతపస్విగా పేరు తెచ్చుకున్నారు డైరెక్టర్ కె. విశ్వానాథ్. ఆయన తెరకెక్కించిన ఎన్నో హిట్ చిత్రాల్లో సిరివెన్నెల సినిమా ప్రత్యేకం.

కె. విశ్వనాథ్.. తెలుగు సినిమాకు ఓ గౌరవాన్ని.. గుర్తింపును తీసుకువచ్చిన దర్శకులలో ఒకరు. సౌండ్ రికార్డి్స్టుగా చిత్రపరిశ్రమలో అడుగు పెట్టి సహాయ దర్శకుడిగా మారి.. ఆ తర్వాత దర్శకుడిగా హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. మెగా ఫోన్ పట్టుకోవడామే కాకుండా.. కెమెరా ముందు నటుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా ఆత్మ గౌరవం. ఈ చిత్రానికి రాష్ట్రప్రభుత్వం నుంచి నంది అవార్డ్ లభించింది. ఆ తర్వాత శంకరాభరణం. ఘన విజయం అందుకున్న ఈ సినిమా జాతీయ పురస్కారం సొంతం చేసుకుంది. ఇక విశ్వనాథ్ కెరీర్ లోనే మైలురాయిగా నిలిచిన చిత్రాలలో సిరివెన్నెల ఒకటి. కానీ అదే సినిమా తనను మానసికంగా బాధపెట్టిందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు.
సప్తపది, స్వాతిముత్యం, స్వయం కృషి, శుభోదయం, శుభలేఖ, అపద్భాంధవుడు, శుభసంకల్పం వంటి అద్భుతమైన చిత్రాలను రూపొందించి కళాతపస్విగా పేరు తెచ్చుకున్నారు డైరెక్టర్ కె. విశ్వానాథ్. ఆయన తెరకెక్కించిన ఎన్నో హిట్ చిత్రాల్లో సిరివెన్నెల సినిమా ప్రత్యేకం. తన సినిమాలతో ప్రేక్షకుల మనసులను తేలికచేసే విశ్వనాథ్ మనసును బాధపెట్టిందట ఈ సినిమా. అసలు ఎందుకు అనేది తెలుసుకుందామా.




తన కెరీర్ లో విశ్వానాథ్ ను తృప్తిపరిచిన సినిమా ఏదని ప్రశ్నించగా.. ఆయన స్పందిస్తూ.. “కళాకారుడు అనేవాడు జీవితాంతం తృప్తి పొందడు. ఇంకా ఏదో చేయాలి.. సాధించాలనే అసంతృప్తితోనే బతుకుతాడు. నేను అంతే. కానీ నన్ను మానసికంగా చాలా బాధపెట్టిన సినిమా మాత్రం సిరివెన్నెల. అసలు ఒక మాటలు రాని అమ్మాయి ఏంటీ.. కళ్లు కనబడని అబ్బాయి ఏంటీ.. వారిద్దరి మధ్య సన్నివేశాలు క్రియేట్ చేయడానికి నేను రాత్రి పగలు కష్టపడడం ఎందుకు. ఆ కథ ఎందుకు స్టార్ట్ చేశానో అని బాధపడ్డాను.. చిత్రీకరణ మధ్యలో ఉన్నప్పుడు అటు ముగించలేను. ఇటు సినిమాను ఆపేయలేను. ఆ సమయంలో చిత్రవధ అనుభవించాను” అంటూ తెలియజేశారు. ఈ సినిమా తెలుగు తెరపై ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది.




