Pelli Sandadi : దర్శకేంద్రుడి ‘పెళ్లి సందD’ నుంచి అందమైన గీతం.. మరోసారి అలరించిన కీరవాణి సంగీతం..
టాలీవుడ్ లో ఎంతమంది దర్శకులు ఉన్నపటికీ రాఘవేంద్రరావు స్థానం వేరు. ఆయన సంచలనాలకు మరు పేరు అని చెప్పవచ్చు.

Pelli Sandadi : టాలీవుడ్ లో ఎంతమంది దర్శకులు ఉన్నపటికీ రాఘవేంద్రరావు స్థానం వేరు. ఆయన సంచలనాలకు మరు పేరు అని చెప్పవచ్చు. రాఘవేంద్రరావును నేటి తరం దర్శకులు ఎంతోపంది ఆదర్శంగా తీసుకుంటారు. అందుకే ఆయన దర్శకేంద్రుడు అయ్యారు. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు రాఘవేంద్రరావు. ఇక రాఘవేంద్ర రావు చాలా కాలం గ్యాప్ తర్వాత తెరకెక్కస్తున్న సినిమా పెళ్ళిసందడి. గతంలో శ్రీకాంత్ హీరోగా వచ్చిన ‘పెళ్ళిసందడి’ సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కుతుంది. శ్రీకాంత్ నటించిన ‘పెళ్ళిసందడి’ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇప్పడు దర్శకేంద్రుడు తెరకెక్కిస్తున్న’పెళ్ళిసందడి’లో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్లు ఉండనున్నారని తెలుస్తుంది.
తెలుగమ్మాయి శ్రీలీల హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఇప్పటికే షూటింగ్ ఫైనల్ స్టేజీలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సాంగ్ ని తాజాగా విడుదల చేసారు. సినిమానుంచి ‘ప్రేమంటే ఏంటి’ అని సాంగ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. కీరవాణి అందించిన బాణీలకు లిరిసిస్ట్ చంద్రబోస్ అందమైన పదాలను సాహిత్యంగా అందించారు. ఈ పాటను హరిచరణ్ – శ్వేతా పండిట్ కలిసి ఆలపించారు. ఈ రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ ని కె. కృష్ణమోహన్ రావు సమర్పణలో ఆర్.కె. ఫిలిం అసోసియేట్స్ – ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. అప్పటి ‘పెళ్లి సందడి’ మాదిరిగానే ఇప్పుడు ‘పెళ్లి సందD’ సినిమాతో మరోసారి పాటల సందడి మొదలైందని చెప్పవచ్చు.
మరిన్ని ఇక్కడ చదవండి :
