Prabhas: ప్రభాస్ కంటే ముందు ఈశ్వర్ సినిమా కోసం ఎవరిని హీరోగా అనుకున్నారో తెలుసా..?

ఈ ఇరవై ఏళ్లలో భారీగా అభిమానులను సొంతం చేసుకున్న ప్రభాస్. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులున్నారు. తన అభిమానులను ప్రభాస్ డార్లింగ్స్ అని పిలుస్తుంటాడు.

Prabhas: ప్రభాస్ కంటే ముందు ఈశ్వర్ సినిమా కోసం ఎవరిని హీరోగా అనుకున్నారో తెలుసా..?
Prabhas
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 12, 2022 | 3:54 PM

ప్రభాస్ సినిమా ప్రస్థానానికి 20 ఏళ్ళు  పూర్తయ్యాయి. ఈశ్వర్ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఈ ఇరవై ఏళ్లలో భారీగా అభిమానులను సొంతం చేసుకున్న ప్రభాస్. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులున్నారు. తన అభిమానులను ప్రభాస్ డార్లింగ్స్ అని పిలుస్తుంటాడు..ఇక ఫ్యాన్స్ సైతం ప్రభాస్‍ను డార్లింగ్ అంటూ ముద్దుగా పిల్చుకుంటారు. ఇక ప్రభాస్ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు అభిమానులు. ఇక ఈశ్వర్ సినిమా రిలీజ్ అయ్యి 20ఏళ్ళు అవ్వడంతో దర్శకుడు జయంత్ సి పరాన్జీ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అసలు ఈశ్వర్ సినిమా ప్రభాస్ చేయాల్సింది కాదట. ప్రభాస్ ఈశ్వర్ సినిమా కథ ముందుగా మరో హీరోకి చెప్పారట జయంత్ సి పరాన్జీ. ఆ హీరో ఎవరంటే..

జయంత్ సి పరాన్జీ మాట్లాడుతూ.. ఈశ్వర్ సినిమా కథ ముందుగా మరో హీరో కోసం అనుకున్నాం అన్నారు. ఆయన పేరు చెప్పలేదు కానీ.. ఒక పెద్ద ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్న హీరో కోసం ఈ సినిమాను అనుకున్నాం అని అన్నారు. అయితే అదే సమయంలో ప్రభాస్ ఫోటోను పక్కన పెట్టుకుకొని చూస్తే ఈ కథ కరెక్ట్ గా ప్రభాస్ కు సూటవుతుందని అనిపించింది అన్నారు.

ప్రభాస్ కు మొదట ఈ కథ గురించి పెద్దగా చెప్పలేదట.. కేవలం మెయిన్ పాయింట్ చెప్పడంతోనే అతను ఓకే చేశారని అన్నారు.  పూర్తిగా తనపై నమ్మకం పెట్టుకొని సినిమాలో నటించినట్లుగా  జయంత్ సి పరాన్జీ చెప్పుకొచ్చారు. అయితే ఈశ్వర్ సినిమాను మిస్ చేసుకున్న హీరో అల్లు అర్జున్ అని అంటున్నారు కొందరు. ఎందుకంటే హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు బన్నీ కూడా చాలా కథలు మిస్ చేసుకున్నాడు అందులో ఇది కూడా ఒకటి అని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నిమ్మ కాయను నేరుగా అప్లై చేస్తే చర్మానికి ఎంత హానికరమో తెలుసా
నిమ్మ కాయను నేరుగా అప్లై చేస్తే చర్మానికి ఎంత హానికరమో తెలుసా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025: మీరు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025: మీరు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
భారతీయులకు భారీ గుడ్‌న్యూస్.. అమెరికా సంచలన నిర్ణయం!
భారతీయులకు భారీ గుడ్‌న్యూస్.. అమెరికా సంచలన నిర్ణయం!
వందకోట్లు ఇచ్చిన ఆ పని చేయను..
వందకోట్లు ఇచ్చిన ఆ పని చేయను..
మొబైల్‌ని ఫుల్ చార్జింగ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరం
మొబైల్‌ని ఫుల్ చార్జింగ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరం
కుంభమేళాపై విదేశీయులూ ఆసక్తి ఎన్ని దేశాల వారు ఆరా తీస్తున్నారంటే
కుంభమేళాపై విదేశీయులూ ఆసక్తి ఎన్ని దేశాల వారు ఆరా తీస్తున్నారంటే
సూపర్ ఫీచర్స్‌తో నయా ఫోన్ రిలీజ్ చేసిన రెడ్‌మీ..!
సూపర్ ఫీచర్స్‌తో నయా ఫోన్ రిలీజ్ చేసిన రెడ్‌మీ..!
మేం తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరగలేరు: కిషన్ రెడ్డి
మేం తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరగలేరు: కిషన్ రెడ్డి
థాయిలాండ్ కు పర్యాటకుల క్యూ.. 2024లో ఎంతమంది సందర్శించారంటే..?
థాయిలాండ్ కు పర్యాటకుల క్యూ.. 2024లో ఎంతమంది సందర్శించారంటే..?
హైవేపై పోలీసులను చూసి పరుగులు పెట్టిన కారు.. ఛేజ్ చేసి పట్టుకోగా.
హైవేపై పోలీసులను చూసి పరుగులు పెట్టిన కారు.. ఛేజ్ చేసి పట్టుకోగా.