Gopichand Malineni: సొంతూరికి సాయం.. ఆ మంచి పని చేసి శభాష్ అనిపించుకుంటోన్న డైరెక్టర్ గోపిచంద్
ఇటీవల ప్రకాశం జిల్లా ఒంగోలు మండలంలోని తన సొంతూరు బొద్దులూరివారిపాలెంలో ఉగాది వేడుక జరుపుకున్నారు గోపిచంద్. ఈ శుభ సందర్భాన తన తాతయ్య ఉన్నం పెద సుబ్బయ్య, అమ్మమ్మ సీతమ్మ, తండ్రి మలినేని వెంకటేశ్వర్లు చౌదరి జ్ఞాపకార్థం తాను నిర్మించిన బస్ షెల్టర్‌ను ప్రారంభించారు.

వీరసింహారెడ్డితో బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుని స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయారు గోపిచంద్ మలినేని. తన డైరెక్షన్‌తో బాలయ్య అభిమానులను అమితంగా ఆకట్టుకున్న ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు తన మంచి మనసుతో అందరి మనసులు గెల్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ప్రకాశం జిల్లా ఒంగోలు మండలంలోని తన సొంతూరు బొద్దులూరివారిపాలెంలో ఉగాది వేడుక జరుపుకున్నారు గోపిచంద్. ఈ శుభసందర్భాన తన తాతయ్య ఉన్నం పెద సుబ్బయ్య, అమ్మమ్మ సీతమ్మ, తండ్రి మలినేని వెంకటేశ్వర్లు చౌదరి జ్ఞాపకార్థం తాను నిర్మించిన బస్ షెల్టర్‌ను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బంధువులు, స్నేహితుల సాయంతో తాను ఈ బస్ షెల్టర్ నిర్మించానని.. మిత్రుల సహకారంతో సొంతూరికి మరిన్ని సౌకర్యాలు సమకూరుస్తానని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో సొంతూరితో తనకున్న మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు గోపీచంద్.
ఇక్కడ రీఫ్రెష్ అవుతా..
‘ నేను మా ఊరికి ఎప్పుడొచ్చినా సరే ఒక మంచి బస్ షెల్టర్ ఉంటే బాగుంటుంది అని ఎప్పుడూ అనుకునేవాడిని. నా ఆలోచనకు నా స్నేహితులు అందరూ సహకారం అందించారు. ఇది నా సొంతూరికి నేను చేసిన ఒక చిన్న సాయం మాత్రమే. ఈ ఊరిలో చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. నా స్నేహితులతో కలిసి మేం పుట్టిన ఊరికి ఏం కావాలో ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తాం. బొద్దులూరివారిపాలెంతో నాకు ఆత్మీయ అనుబంధం ఉంది. ఈ గ్రామంలో అందరూ తనకు బంధువులే. ఇక్కడ అందరి పేర్లు నాకు తెలుసు. ఒక డైరెక్టర్‌గా నేను ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చినా సరే బొద్దులూరివారిపాలెం వచ్చి ఒక రెండు రోజులు ఉంటే ఆ ఆనందం ఇంకెక్కడా దొరకదు. నేను ప్రతి సినిమా చేసిన తరవాత ఈ ఊరొచ్చి నాలుగైదు రోజులు ఉండి వెళ్తుంటాను. నాకు అదే పెద్ద రీప్రెష్. ఇంకా ఊరికి ఏం కావాలన్నా సర్పంచ్ కవితకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది’ అని తెలిపారు గోపీచంద్.





Gopichand Malineni
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..
