Love Today: లవ్‏టుడే మూవీ సీన్ ట్రోలింగ్ పై స్పందించిన డైరెక్టర్ గౌతమ్ మీనన్.. ఏమన్నారంటే..

లవ్ టుడే మూవీలో మామకుట్టి అనే సౌండ్ ట్రాక్ ఎంతగా పాపులర్ అయ్యిందో కూడా చెప్పక్కర్లేదు. కొన్నిసందర్భాల్లో ఈ సినిమాలోని మామకుట్టి అనే సీన్ ద్వారా స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ను ట్రోల్ చేశారట. ఈ చిత్రంలోని ఓ వ్యక్తి ఆయనను పోలినట్లు ఉండడంతో దర్శకుడిని ట్రోల్ చేసినట్లుగా తెలుస్తోంది.

Love Today: లవ్‏టుడే మూవీ సీన్ ట్రోలింగ్ పై స్పందించిన డైరెక్టర్ గౌతమ్ మీనన్.. ఏమన్నారంటే..
Gautham Menon
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 31, 2022 | 7:10 AM

లవ్ టుడే.. ఈఏడాది యువతకు ఎక్కువగా కనెక్ట్ అయిన సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో ఈ మూవీ ఒకటి. కోమాలి ఫైమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించి.. దర్శకత్వం వహించిన ఈ సినిమా అటు తమిళంలోనే కాకుండా.. ఇటు తెలుగులోనూ భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఇందులో ప్రదీప్, కామెడీ టైమింగ్స్ థియేటర్లలు నవ్వులు పూయిస్తాయి. అలాగే ఈ సినిమాలో ఇవానా కథానాయికగా నటించింది. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ బాగా కుదిరాయి. ఈ మూవీలో మామకుట్టి అనే సౌండ్ ట్రాక్ ఎంతగా పాపులర్ అయ్యిందో కూడా చెప్పక్కర్లేదు. కొన్నిసందర్భాల్లో ఈ సినిమాలోని మామకుట్టి అనే సీన్ ద్వారా స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ను ట్రోల్ చేశారట. ఈ చిత్రంలోని ఓ వ్యక్తి ఆయనను పోలినట్లు ఉండడంతో దర్శకుడిని ట్రోల్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమాలో హీరోహీరోయిన్స్ ఫోన్స్ మార్చుకున్నాక.. ఓ కామెడీ సన్నివేశంలో గౌతమ్ మీనన్ ను పోలిన ఓ వ్యక్తి హీరోయిన్ వెంటపడే సన్నివేశం ఉంది. ఆ సీన్ చూశాక సదరు కమెడియన్ ను గౌతమ్ మీనన్ తో పోల్చుతూ ట్రోల్స్ చేశారు. దీంతో ఈ విషయంపై ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో గౌతమ్ మీనన్ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. లవ్ టుడే సినిమాలో తనపై వచ్చిన ట్రోల్ ను ఎలా వచ్చాయో చెబుతూ.. ఆ పాత్ర కోసం తనని అడిగితే నటించేవాడ్ని కదా అని చెప్పాడు. ” ఆ సీన్ కోసం నన్నే అడిగి ఉండొచ్చు కదా.. నేనే చేసేవాడ్ని ” అంటూ సరదాగా రియాక్ట్ అయ్యారు గౌతమ్. ఇక మరోవైపు ఈ సినిమాలో నటించిన గురుబాయి ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.