Prabhas: ప్రభాస్-సుకుమార్ సినిమా టైటిల్ ఇదే.. డార్లింగ్ సరసన ఆ బ్యూటీ ..
పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తోన్న ఈ చిత్రంలో మలయాళ టాలెంటెడ్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలో కనిపిస్తుండగా.. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తుంది. ఇదే కాకుండా.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె, డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ ఏడాది విడుదలైన రాధేశ్యామ్ తీవ్ర నిరాశకు గురిచేసింది. దీంతో ప్రస్తుతం డార్లింగ్ నటిస్తోన్న సలార్ చిత్రంపైనే ఆశలన్నీ ఉన్నాయి. ఈ సినిమాకు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండడం..ఇప్పటికే విడుదలైన వర్కింగ్ స్టిల్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది. పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తోన్న ఈ చిత్రంలో మలయాళ టాలెంటెడ్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలో కనిపిస్తుండగా.. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తుంది. ఇదే కాకుండా.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె, డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూడు చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకంటున్నాయి. ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు కొత్త ప్రాజెక్టులకు కూడా డార్లింగ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడట. పుష్ప సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన దర్శకుడు సుకుమార్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడట.
పుష్ప 2 చిత్రం అనంతరం వీరిద్దరి కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందట. ఇక ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ రా ఫార్మాట్ లో ఉండనుందని.. ఆంధ్రప్రదేశ్, రాయలసీమ నేపథ్యంలో ఉండనుందట. ఈ సినిమాకు భవానీ అనే టైటిల్ ఫిక్స్ చేయనున్నారట. అలాగే ఇందులో ప్రభాస్ సరసన సాయి పల్లవిని ఎంపిక చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారట. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.
ఇక ఇటీవలే బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2లో సందడి చేసిన ప్రభాస్.. తన వ్యక్తిగత విషయాలు గురించి స్పందించారు. ముఖ్యంగా.. ప్రేమ, పెళ్లి గురించి హింట్ ఇచ్చేశాడు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.