OTT: ఓటీటీలో అలరిస్తున్న జూనియర్ శ్రీదేవి ‘మిలీ’.. ‘దృశ్యం 2’ కూడా.. కానీ
జాన్వీకపూర్ ‘మిలీ’, అజయ్ దేవ్‌గణ్ ‘దృశ్యం 2’ సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయంటే..?
జూనియర్ శ్రీదేవి జాన్వీకపూర్ లీడ్ రోల్‌లో నటించిన మూవీ ‘మిలీ’. ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘నెట్‌ఫ్లిక్స్’ వీక్షకులకు అందుబాటులో ఉంది. ఇదే విషయాన్ని కన్ఫామ్ చేస్తూ.. ‘మీరు చేస్తున్న వర్క్‌కు పులుస్టాప్ పెట్టి, మిలీ స్టోరీ చూడండి’ అని ‘నెట్‌ఫ్లిక్స్’ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. మలయాళ మూవీ ‘హెలెన్’కు రీమేక్‌గా తెరకెక్కిన ‘మిలీ’ నవంబరు 4న థియేటర్లలోకి వచ్చింది. మత్తుకుట్టి జేవియర్ డైరెక్షన్ చేసిన ఈ సినిమాలో జాన్వీ లీడ్ రోల్‌లో ఆకట్టుకున్నారు. అనుకోని పరిస్థితుల్లో మైనస్ 18 డిగ్రీల ఎముకలు గడ్డకట్టుకుపోయే చలిలో ఇరుక్కుపోయిన ఓ యువతి ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటకు వచ్చింది? అన్న ఇంట్రస్టింట్ స్టోరీతో రూపొందింది ఈ మూవీ.
దృశ్యం 2 కూడా ఓటీటీలోకి…
వచ్చిన అన్ని భాషల్లో సూపర్‌హిట్ అయిన మూవీ ‘దృశ్యం’. మలయాళం, తెలుగులో ఎప్పుడో దానికి సీక్వెల్స్ వచ్చేశాయి. హిందీ ‘దృశ్యం 2’ ఈ సంవత్సరం నవంబరులో రిలీజైంది. అజయ్ దేవ్‌గణ్ , శ్రియ, టుబు లీడ్ రోల్స్‌లో నటించిన ఆ సినిమా బాక్సాఫీసు వద్ద రూ. 300 కోట్లను కొల్లగొట్టింది. ఇప్పుడు ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ వేదికగా అభిమానులను అలరించనుంచనుంది. అయితే, అది సబ్‌స్క్రిప్షన్ ఉన్న అందరూ ఈ మూవీ చూడలేరు. పే పర్ వ్యూ ద్వారా మూవీ అందుబాటులో ఉంటుంది. ఈ మూవీని రెంట్‌కు అందుబాటులో ఉంచినట్టు ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ తెలిపింది.అంటే.. ఈ సినిమా చూడాలనుకునేవారు రూ. 199 పే చేయాల్సి ఉంటుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.