Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gautham Menon: డైరెక్టర్ విషయంలో యాంకర్ పొరపాటు.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన గౌతమ్ మీనన్..

అందులో సదరు యాంకర్ మణిరత్నం రూపొందించిన సినిమాను గౌతమ్ మీనన్ తెరకెక్కించినట్లుగా పొరపాటు పడ్డాడు. ఇది గమనించిన డైరెక్టర్ స్పోర్టివ్‏గా తీసుకున్నాడు.

Gautham Menon: డైరెక్టర్ విషయంలో యాంకర్ పొరపాటు.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన గౌతమ్ మీనన్..
Gautham Menon
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 22, 2022 | 3:16 PM

తెలుగు ప్రేక్షకులకు డైరెక్టర్ గౌతమ్ మీనన్ సుపరిచితమే (Gautham Menon). ఘర్షణ, ఏమాయా చేసావేవంటి హిట్ చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఇటీవల పలు చిత్రాల్లో కీలకపాత్రలలో కనిపిస్తూ నటుడిగానూ నిరూపించుకుంటున్నారు. ఆయన ప్రస్తుతం దర్శకత్వం వహించిన సినిమా వెందు తానిందదు కాదు. సెప్టెంబర్ 17న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగులోనూ ఈ సినిమా ముత్తు పేరుతో విడుదలై సూపర్ హిట్‏గా నిలిచింది. ఈ క్రమంలోనే పలు యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు డైరెక్టర్ గౌతమ్ మీనన్. అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానళ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమ్ మీనన్‏కు విచిత్రపరిస్థితి ఎదురైంది. అందులో సదరు యాంకర్ మణిరత్నం రూపొందించిన సినిమాను గౌతమ్ మీనన్ తెరకెక్కించినట్లుగా పొరపాటు పడ్డాడు. ఇది గమనించిన డైరెక్టర్ స్పోర్టివ్‏గా తీసుకున్నాడు.

తన చివరి చిత్రంలో సిలంబరసన్, విజయ్ సేతుపతి.. ఇంకా మిగతా స్టార్లను ఒకే దగ్గరకు తీసుకురావడం ఎంత కష్టంగా అనిపించింది ? అని అడిగాడు. అయితే వీరంతా కలిసి నటించిన సినిమా చెక్క చివంత వానమ్. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, అరవింద స్వామి, విజయ్ సేతుపతి, శింబు, అరుణ్ విజయ్ నటించారు. తెలుగులో నవాబ్ పేరుతో విడుదలైంది. అయితే ఈ సినిమాను తెరకెక్కించింది గౌతమ్ మీనన్ కాదు. డైరెక్టర్ మణరత్నం. ఈ విషయం తెలియకుండా యాంకర్ అడగడంతో.. గౌతమ్ మీనన్ హీలేరియస్ ఆన్సర్ ఇచ్చాడు. “శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్, అరవింద్ స్వామితో కలిసి పనిచేయడం చాలా కష్టం. వీరు డేట్స్ దొరకడం చాలా కష్టం. వీరంత చాలా బిజీగా ఉంటారు. కానీ నేను మణిరత్నం కదా.. నేను పిలిస్తే వచ్చేస్తారు. ఉదయం 4.30 గంటలకు షూటింగ్ ప్రారంభిస్తాను. కానీ అప్పటికే వారంత వస్తేస్తారు. గౌతమ్ మీనన్ సినిమాకు శింబు ఉదయం 7 గంటలకు షూటింగ్ వచ్చాడని విని ఉంటారు. కానీ నేను మణిరత్నం కదా. అందుకే అతడు 4.30 గంటలకే వచ్చేశాడు. అది గొప్ప అనుభవం” అంటూ నవ్వుతూనే యాంకర్‏కు కౌంటరిచ్చాడు డైరెక్టర్. అయితే గౌతమ్ మీనన్ చేసిన ఫన్నీ కామెంట్స్ యాంకర్‏కు అర్థం కాకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

గౌతమ్ మీనన్ తన ఇంటర్వ్యూలలో మణిరత్నం,అతని సినిమాల పట్ల తనకున్న ప్రగాఢమైన అభిమానాన్ని చాలాసార్లు చెప్పారు. తన కెరీర్ ప్రారంభంలో, అతను మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరడానికి ప్రయత్నించాడు, కానీ అది కుదరలేదు. కానీ ఇటీవల నెట్ ఫ్లిక్ కోసం నవరస వెబ్ సిరీస్ కోసం మణిరత్నంతో కలిసి పనిచేశారు గౌతమ్ మీనన్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.