Rajamouli: ఇంత అభిమానమేంటయ్య.. రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్.. అందులో ఏం రాసుందంటే?

అలాంటి స్టార్ డైరెక్టర్ తమ సినిమాపై ప్రశంసలు కురిపిస్తే ఎలా ఉంటుంది. టీజర్‏ చూసి ఫిదా అయిన జక్కన్న సినిమా, చిత్రయూనిట్ ను పొగుడుతూ ఏకంగా లెటర్ రాసారట. దీంతో ఆ లేఖను ఫ్రేమ్ కట్టించుకుని మరీ దాచుకున్నానని అంటున్నాడు టాలీవుడ్ డైరెక్టర్. అతడు మరెవరో కాదు.. కార్తీకేయ 1, 2 వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న దర్శకుడు చందూ మొండేటి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

Rajamouli: ఇంత అభిమానమేంటయ్య.. రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్.. అందులో ఏం రాసుందంటే?
Chandoo Mondeti
Follow us
Rajitha Chanti

|

Updated on: May 04, 2024 | 7:38 AM

బాహుబలి సినిమాతో తెలుగు మూవీ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన డైరెక్టర్ రాజమౌళి. ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క నటించిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఆ తర్వాత ట్రిపుల్ ఆర్ సినిమాతో హాలీవుడ్ మేకర్స్ మెప్పు పొందాడు. ఈ మూవీతో ఆస్కార్ వేదికగా సత్తా చాటాడు. దీంతో ఇప్పుడు తెలుగు సినిమా వైపు ప్రపంచమంతా చూస్తోంది. అలాంటి స్టార్ డైరెక్టర్ తమ సినిమాపై ప్రశంసలు కురిపిస్తే ఎలా ఉంటుంది. టీజర్‏ చూసి ఫిదా అయిన జక్కన్న సినిమా, చిత్రయూనిట్ ను పొగుడుతూ ఏకంగా లెటర్ రాసారట. దీంతో ఆ లేఖను ఫ్రేమ్ కట్టించుకుని మరీ దాచుకున్నానని అంటున్నాడు టాలీవుడ్ డైరెక్టర్. అతడు మరెవరో కాదు.. కార్తీకేయ 1, 2 వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న దర్శకుడు చందూ మొండేటి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. “కార్తికేయ సినిమా సమయంలో నిఖిల్ మినహా అందరం కొత్తవాళ్లమే. అప్పటికీ సినిమాపై అంతగా బజ్ కూడా లేదు. కానీ టీజర్ రిలీజ్ అయ్యాక బాగుందంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. ఎవరో ఫోన్ చేసి చెప్తే చూసి ఆశ్చర్యపోయాను. అప్పటికే సినిమా అన్నదానికంటే ఎక్కువగా సంతోషపడిపోయాము. ఆ తర్వాత ట్రైలర్, టీజర్ రిలీజ్ అయ్యాక మా టీంను అభినందిస్తూ ఒక లెటర్ రాసిచ్చారు. ఆ లెటర్ ను ఫ్రేమ్ కట్టించుకుని మరీ పెట్టుకున్నాను. సినిమా విడుదలకు ముందే జక్కన్నను ఇంప్రెస్ చేయడం.. నా తొలి చిత్రానికే రాజమౌళి నుంచి ప్రశంసలు రావడం చాలా సంతోషంగా అనిపించింది” అంటూ చెప్పుకొచ్చారు.

సాధారణంగా తనకు సినిమా, ట్రైలర్, టీజర్ నచ్చితే ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అవుతుంటారు రాజమౌళి. అలాగే చిన్న, పెద్ద సినిమాలు అని తేడా లేకుండా డైరెక్షన్, మేకింగ్ నచ్చితే ప్రశంసలు కురిపిస్తారు. ప్రస్తుతం చందూ మోండేటీ తండేల్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అక్కినేని నాగచైతన్య, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. మత్య్సకారుల జీవితాల నేపథ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కి్స్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ ఆకట్టుకున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.