AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Buchibabu Sana: ఒకే ఊరిలో.. ఒకే హాస్పిటల్లో పుట్టాం.. ఇది దేవుడు రాసిన రాత.. డైరెక్టర్ బుచ్చిబాబు..

దర్శకుడిగా మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నారు డైరెక్టర్ బుచ్చిబాబు సన. ఆయన తెరకెక్కించిన ఉప్పెన సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతగా హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. దీంతో సెకండ్ సినిమాకే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారు. ప్రస్తుతం పెద్ది సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.

Buchibabu Sana: ఒకే ఊరిలో.. ఒకే హాస్పిటల్లో పుట్టాం.. ఇది దేవుడు రాసిన రాత.. డైరెక్టర్ బుచ్చిబాబు..
Puri Jagannadh, Buchibabu S
Rajitha Chanti
|

Updated on: Jun 29, 2025 | 11:59 AM

Share

డైరెక్టర్ బుచ్చిబాబు సన.. తొలి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించారు. మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ సంచలనం సృష్టించింది. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పెద్ది సినిమాను రూపొందిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇటీవల విడుదలైన టీజర్ మూవీపై అంచనాలు మరింత పెంచేశాయి. స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బుచ్చిబాబు తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

ప్రస్తుతం పెద్ది సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్న డైరెక్టర్ బుచ్చిబాబు సన ఇప్పుడు చేసిన పోస్ట్ ఆకట్టుకుంటుంది. అందులో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. ‘మా ఇద్దరిదీ పిఠాపురం.. ఇద్దరం ఒకే ఆసుపత్రిలో జన్మించాం. ఇది దేవుడు రాసిన రాత.. ఇదే విధి.. ఇప్పుడు మేం ఇద్దరం డైరెక్షన్ అనే ఒకే మార్గంలో ఇలా కలిసి ప్రయాణిస్తున్నాం” అంటూ రాసుకొచ్చారు. అలాగే పూరి జగన్నాథ్ ను కలిసిన ఫోటో పంచుకున్నారు. ప్రస్తుతం బుచ్చిబాబు చేసిన పోస్ట్ అందరినీ ఆకర్షిస్తుంది.

ఇదిలా ఉంటే.. కొన్నాళ్లు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఇండస్ట్రీని షేక్ చేసిన ఆయన ఇప్పుడు సరైన హిట్టు కొట్టేందుకు ట్రై చేస్తున్నారు. ఇటీవల ఆయన తెరకెక్కించిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో టబు, సంయుక్త మీనన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..