AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Konaseema: దేశంలో ఇంకా లాంచ్ కానీ టెస్లా ట్రక్ కోనసీమకు వచ్చింది.. అందులో వచ్చింది ఎవరంటే..?

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అరుదైన దృశ్యం కనిపించింది. ఫ్యూచరిస్టిక్ లుక్‌తో ఉన్న టెస్లా సైబర్ ట్రక్ అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో సందడి చేసింది. చెన్నైకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆదిత్య రామ్ సంక్రాంతి పండుగ సందర్భంగా అత్తారింటికి టెస్లా సైబర్ ట్రక్‌లో రావడంతో జనం ఆసక్తిగా తిలకించారు.

Konaseema: దేశంలో ఇంకా లాంచ్ కానీ టెస్లా ట్రక్ కోనసీమకు వచ్చింది.. అందులో వచ్చింది ఎవరంటే..?
Tesla Cybertruck
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Jan 16, 2026 | 8:57 PM

Share

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో టెస్లా సైబర్ ట్రక్ సందడి చేసింది. కోనసీమలో జరిగే సంక్రాంతి సంబరాలకు చెన్నైకు చెందిన వ్యాపార దిగ్గజం ఆదిత్య రామ్ అత్తారింటికి టెస్లా సైబర్ ట్రక్‌లో వచ్చారు. ఎక్కడా చూడని కొత్త, వింత వాహనం కావడంతో.. చూసేందుకు జనం గుమిగుడారు. టెస్లా సైబర్ ట్రక్‌లో కోనసీమకు వచ్చిన వ్యక్తి ప్రముఖ వ్యాపారవేత్త ఆదిత్య రామ్. ఆయన కోనసీమ అల్లుడు. పండుగ వేళ అత్తారింటికి వచ్చారు. అమలాపురం గడియార స్తంభం సెంటర్లో ఆయన వాహనాన్ని చూసి జనం వింతగా ఉందంటూ ఆసక్తిగా చూసి సెల్ఫీలు దిగారు. కోనసీమకు వచ్చిన వ్యాపారవేత్త ఆదిత్యా రామ్‌కు అమలాపురం గడియార స్తంభం సెంటర్లో అత్తింటి బంధువులు ఘనంగా స్వాగతం పలికారు. గడియార స్తంభం సెంటర్లో కారు ఆగడంతో అటుగా వెళ్లే జనం ఆగి కారుతో సెల్ఫీలు తీసుకున్నారు. దీంతో కొంతసేపు అమలాపురం గడియారం సెంటర్లో ట్రాఫిక్‌కు అంతరాయం కూడా ఏర్పడింది. సెల్ఫీలు తీసుకున్న అనంతరం ఆదిత్య అక్కడి నుంచి ఆ కారులో బయలుదేరి అత్తారింటికి వెళ్లి పోయారు.

టెస్లా సైబర్ ట్రక్ ఫ్యూచరిస్టిక్, బుల్లెట్‌ప్రూఫ్ లుక్‌తో స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ కలిగి ఉంటుంది. ఒక్కసారి చార్జ్‌తో సుమారు 400–500 కి.మీ ప్రయాణిస్తుంది. ఇది  ఇండియాలో అధికారికంగా లాంచ్ కాలేదు. ఆదిత్య రామ్  ప్రవేట్ ఇంపోర్ట్ చేసుకుని ఉంటారు. లేదా టెంపరరీ / డెమో రిజిస్ట్రేషన్ తో తీసుకువచ్చి ఉండాలి. భారీ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, ఆటోపైలట్ / సెల్ఫ్ డ్రైవింగ్ సపోర్ట్, భారీ లోడ్ మోయగల సామర్థ్యం (పికప్ ట్రక్), ఆఫ్‌రోడ్‌కు అనుకూలం వంటి సౌలభ్యాలు దీనికి ఉంటాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!