Chiranjeevi: కోపంతో ఊగిపోతూ కుర్చీ విసిరేశారు..మెగాస్టార్ లో మరో కోణం చెప్పిన డైరెక్టర్ బాబీ
ఎప్పుడూ కామ్‌గా.. కూల్‌గా.. నవ్వుతూ కనిపించే చిరంజీవి.. కోపం చూపించే సందర్భాలు చాలా అరుదు. కాని అలాంటి అరుదైన ఓ సందర్భంలో తను పక్కనే ఉన్నా అంటూ తాజాగా ఓ ఇంటర్య్వూలో చెప్పారు బాబీ.
ఫిల్మ్ ఇండస్ట్రీలో కోపానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే ఎవరైన టక్కున చెప్పే పేరు బాలకృష్ణ. అలాంటి బాలకృష్ణను మించేలా ఓ సారి చిరు సీరియస్ అయ్యారని తాజాగా చెప్పారు వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ. చిరులో మరో కోణం చూశా అన్నట్టు ఓ ఎక్స్ ప్రెషన్ కూడా ఇచ్చారు ఈ యంగ్ డైరెక్టర్.
ఎప్పుడూ కామ్‌గా.. కూల్‌గా.. నవ్వుతూ కనిపించే చిరంజీవి.. కోపం చూపించే సందర్భాలు చాలా అరుదు. కాని అలాంటి అరుదైన ఓ సందర్భంలో తను పక్కనే ఉన్నా అంటూ తాజాగా ఓ ఇంటర్య్వూలో చెప్పారు బాబీ.
బాసు ఓ సినిమా షూట్ గ్యాప్లో కూర్చోని ఇడ్లీ తింటూ ఉండగా.. మేనేజర్ తన పక్కనే తచ్చాడుతూ కాస్త టెన్షన్‌గా కనిపించారట. దీంతో మెగాస్టార్ పిలిచి ఏంటని ఆరా తీయగా.. షాట్ రెడీ అయి చాలా సేపైందని చెప్పారట. దీంతో ఒక్క సారిగా సీరియస్ అయిన చిరు.. పక్కనే ఉన్న కుర్చీని విసిరేసి.. మేనేజర్ పై అరిచారట. మీ బోడి ఫెర్ఫార్మెన్సులు నా దగ్గరొద్దంటూ ఊగిపోయారట. తాను తినే ఇడ్లీ కంటే షాట్ ఇంపార్టెంట్ అని మేనేజర్‌తో చెప్పారట. షాట్ రెడీ అవగానే నేరుగా తనకు చెప్పాలని ఎన్ని సార్లు చెప్పినా ఎందుకు వినవు అన్నారట. ఇక చిరు సీరియస్ రియాక్షన్ తో అక్కడున్న ప్లేస్ అంతా ఒక్కాసారిగా సైలెంట్ అయిపోయిందట. ఇక ఇదే విషయాన్ని తాజాగా బాబీ అందరితో షేర్ చేసుకున్నారు. చిరు టైమ్‌కు… షాట్‌కు ఎంత వ్యాల్యూ ఇస్తారో చెప్పారు బాబీ.