Brahmāstra: ‘ఈ పాత్రకు నాగార్జున గారు పర్ఫెక్ట్ అనిపించింది’.. అయాన్ ముఖర్జీ కామెంట్స్
బాలీవుడ్ లో ప్రస్తుతం వస్తున్న బడా సినిమాల్లో బ్రహ్మాస్త్ర(Brahmāstra) ఒకటి. లవర్ బాయ్ రణబీర్ కపూర్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా చేస్తోంది.
బాలీవుడ్ లో ప్రస్తుతం వస్తున్న బడా సినిమాల్లో బ్రహ్మాస్త్ర(Brahmāstra) ఒకటి. లవర్ బాయ్ రణబీర్ కపూర్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమాను తెలుగులో బ్రహ్మాస్త్రం అనే టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. రణబీర్ కపూర్ – అలియా భట్ – అమితాబ్ బచ్చన్ – మౌనీరాయ్ ప్రధాన పాత్రల్లో ఈ సోషియో ఫాంటసీ అడ్వెంచర్ కథతో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను మూడు పార్ట్ లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ పార్ట్ ని ”బ్రహ్మాస్త్ర మొదటి భాగం: శివ” పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు దర్శకుడు అయాన్ ముఖర్జీ.
ఆయన మాట్లాడుతూ.. బ్రహ్మస్త్ర సినిమా ద్వారా చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక ఫాంటసీ ఫిలిం చెయ్యాలనుకున్నపుడు నన్ను చాలా విషయాలు ఇన్స్పైర్ చేసాయి. మనదేశంలో ఉన్న సంస్కృతి , పురాణాలు , గొప్ప కథలను డైరెక్ట్ గా చెప్పకుండా నా పద్ధతిలో చూపించాను. మీరు ఈ సినిమాను చూస్తున్నప్పుడు మన భారతదేశం సోల్ , అలానే ఆధ్యాత్మికతను కొత్తగా ఎక్స్పీరియన్స్ చేస్తారు అన్నారు. అలాగే కథను రాసుకున్నప్పుడే ఈ పాత్ర కోసం అమితాబ్ బచ్చన్ , ఈ పాత్ర కోసం అలియా, అలానే ఈ పాత్ర కోసం నాగార్జున గారు కావాలి అనుకున్నాము. అమితాబ్ గారికి కథను చెప్పాము, ఆయనకు బాగా నచ్చింది. ఈ పాత్రకు నాగార్జున గారు పర్ఫెక్ట్ అనిపించింది. బ్రహ్మాస్త్ర చూస్తున్నప్పుడు ఇది మన సినిమా అనే అనుభూతి కలుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎన్నో హాలీవుడ్ సినిమాలు 10, 20 సంవత్సరాల క్రితం రాసిన కామిక్ బుక్స్ ఆధారంగా తీసినవే. వాటితోనే అంత కంటెంట్ క్రియేట్ చేసి ఆదరణ పొందినప్పుడు. ఎన్నో గొప్ప గొప్ప కథలు, పురాణ ఇతిహాసాలు ఉన్న మన భారతీయ చరిత్రను యధార్ధంగా ఎందుకు చూపించలేము అనిపించింది. 2011 లో నాకు ఈ ఆలోచన వచ్చింది అలానే అప్పటినుండి ఇప్పటివరకు టెక్నాలిజీ కూడా బాగా డెవలప్ అయింది. అది కూడా కొంతవరకు కలిసొచ్చింది అని చెప్పుకొచ్చారు అయాన్ ముఖర్జీ.