Anil Ravipudi: ఎఫ్ 3లో మనీ ఫస్ట్రేషన్.. అంతకు మించిన కామెడీ.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా3 నటించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న

Anil Ravipudi:  ఎఫ్ 3లో మనీ ఫస్ట్రేషన్.. అంతకు మించిన కామెడీ..  అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Anil Ravipudi
Follow us

|

Updated on: May 25, 2022 | 6:20 PM

ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఎఫ్ 3 సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా3 నటించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ప్రమోషన్ల వేగం పెంచారు చిత్రయూనిట్ సభ్యులు. గత కొద్ది రోజులుగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎఫ్ 3 (F3) సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఎఫ్ 3 సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం విశేషాలని మీడియాతో పంచుకున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. సీక్వెల్ ఫ్రాంచైజీ కాబట్టి కొత్తవారిని పెడితే ఎఫ్ 2 ఫ్రాంచైజీ ఫీల్ రాదు. ఎఫ్ 2లో భార్యభర్తల ఫస్ట్రేషన్ వుంటే ఎఫ్ 3లో మనీ ఫస్ట్రేషన్. డబ్బు చుట్టూ వుండే ఆశ అత్యాశ కుట్ర మోసం ఇవన్నీ హిలేరియస్ గా వర్క్ అవుట్ అయ్యాయి. ఎఫ్ 2 నుండి ఎఫ్ 3కి వచ్చేసరికి అంచనాలు ఖచ్చితంగా ఎక్కువగా వుంటాయి. ఫన్ డోస్ పెంచడానికి ఎలిమెంట్స్ ఎక్కువ వుంటే ఇంకా ఎక్కువ చేయగలం. మామూలు పాత్రతో చేసేకంటే ఇలాంటి పాత్రలతో ఎక్కువ ఫన్ చేయొచ్చనిపించి ఈ క్యారెక్టరైజేషన్స్ యాడ్ చేశాం. ఐతే అవే క్యారెక్టరైజేషన్స్ ప్రధానంగా సినిమా వుండదు. నైట్ సీన్స్ వచ్చినపుడు ఆ ఫన్ వాడుకుంటాం, వరుణ్ నత్తి మీరు ట్రైలర్ లో చూసే వుంటారు. అది కేవలం ట్రైలర్ మాత్రమే. సినిమా దాదాపు ముఫ్ఫై చోట్ల ఆ మేనరిజం వచ్చింది. ప్రతిసారి కొత్తగా వుంటుంది. ఇది నిజంగా చాలెజింగ్ అనిపించింది. మాట అడ్డుపడినప్పుడల్లా కొత్త మ్యానరిజం చేయాలి. అనుకున్నపుడు ఈజీగా అనిపించింది కానీ ప్రాక్టికల్ గా ప్రతిసారి కొత్త మ్యానరిజం అంటే సీన్ కంటే ఎలాంటి మ్యానరిజం ఇవ్వాలనే ఒత్తిడి ఎక్కువ వుండేది.

స్క్రిప్ట్ అంతా పూర్తయిన తర్వాత కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. అందరికీ నష్టం జరిగింది. తెలియకుండానే అందరిలోనూ నిరాశ. ఐతే షూటింగ్ అయిన సీన్స్ ని మళ్ళీ చూసుకుంటూ కాసేపు నవ్వుకుంటూ ఇప్పుడున్న మెంటల్ కండీషన్ కి ఇలాంటి ఫన్ సినిమా ఉపయోగపడుతుందని భావించాం. హీరోయిన్స్ అనే కాదు ఇందులో ప్రతి పాత్ర అత్యాశ గానే వుంటుంది. డబ్బు ఎలా త్వరగా సంపాయించాలనే ఆశతోనే వుంటారు. వారి ప్రయత్నాల్లో జరిగే ఫన్ ఇందులో వుంటుంది. ఎంత ఫన్ వుంటుందో అంత మంచి కంటెంట్ వుంటుంది. ఎఫ్ 2లో ఇచ్చిన ముగింపు అందరికీ నచ్చింది. ఇందులో డబ్బు గురించి చెప్పే ఫైనల్ కంటెంట్ కూడా అందరికీ నచ్చుతుంది. పాండమిక్ సెకండ్ వేవ్ తర్వాత పూజా యాడ్ అయింది. ముగ్గురు హీరోయిన్స్ తో ‘ఊ హ ఆహా ఆహా’ పాటని తీశాం, తర్వాత వచ్చే సెలబ్రేషన్స్ పాట కొంచెం స్పెషల్ గా వుండాలని ఒక స్టార్ హీరోయిన్ గెస్ట్ గా వస్తే బావుంటుదని భావించాం. కథలోనే పూజ హెగ్డే గా వస్తుంది అన్నారు..

ఇవి కూడా చదవండి

అంతేకాకుండా సినిమా టికెట్స్ రేట్స్ గురించి స్పందిస్తూ.. హైదరాబద్ లో కొన్ని ప్రీమియం మల్టీప్లెక్స్ లో తప్ప మిగతా అన్ని చోట్ల టికెట్ ధరలు అందరికీ అందుబాటులోకే తెచ్చాం. ఇది ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఫ్యామిలీ అంతా కలసి వెళ్ళడానికి వీలుగా వుంటే ఒకటి రెండుసార్లు చూస్తారు. నిజానికి ఎఫ్ 3కి కూడా ఎక్కువ బడ్జెట్ అయ్యింది. అయితే టికెట్ ధర ఆడియన్స్ కి కంఫర్ట్ గా వుండటం ముఖ్యం. ఇది ఫ్యామిలీ అంతా కలసి చూడాల్సిన సినిమా. అందుకే టికెట్ ధర అందరికీ అందుబాటులో వుండే విధంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టికెట్ రేట్లు ఉండేలా మా నిర్మాత దిల్ రాజుగారు నిర్ణయం తీసుకున్నారు అంటూ చెప్పుకొచ్చారు.