AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaarasudu: దళపతి విజయ్ వారసుడు మూవీని మిస్ చేసుకున్న మన స్టార్ హీరోలు వీరే..

ఈ సినిమాలో నేషనల్ క్రాష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Vaarasudu: దళపతి విజయ్ వారసుడు మూవీని మిస్ చేసుకున్న మన స్టార్ హీరోలు వీరే..
Vaarasudu
Rajeev Rayala
|

Updated on: Dec 16, 2022 | 6:05 PM

Share

దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వారీసు. ఈ సినిమాను తెలుగు వారసుడు అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రాష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని రెండు పాటలు చాట్ బస్టర్ గా నిలిచాయి. యూట్యూబ్ లో ఈ రెండు సాంగ్ ట్రెండింగ్ లో ఉన్నాయి. తమిళ్ సినిమా అయినప్పటికీ మన దగ్గర కూడా ఈ సినిమా పౌ భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే వారసుడు సినిమాను ముందుగా మన టాలీవుడ్ హీరోలతో చేయాలని అనుకున్నారట. ఈ మూవీ కోసం ఇద్దరు స్టార్ హీరోలను కూడా సంప్రదించారట.

ప్రస్తుతం సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలతో పోటీపడటానికి దళపతి విజయ్ కూడా సిద్దమయ్యారు. సంక్రాంతి అటు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య.. ఇటు బాలయ్య బాబు వీరసింహారెడ్డి సినిమాలతో సిద్ధంగా ఉన్నారు. ఇదే సమయంలో దళపతి వారసుడు అంటూ బరిలోకి దూకుతున్నారు. అయితే ఈ సినిమాను ముందుగా మన టాలీవుడ్ స్టార్ హీరోలతో అనుకున్నారట దిల్ రాజు

దిల్ రాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వారసుడు సినిమాను ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీయాలని అనుకున్నాం. కానీ ఆయన మరో సినిమాతో బిజీగా ఉండటంతో అది కుదరలేదు. ఆ తర్వాత ఈ సినిమాలో రామ్ చరణ్ ని హీరోగా ఎంపిక చేయాలని చూశాం.. కానీ అప్పటికే చరణ్ శంకర్ సినిమాను కమిట్ అయ్యాడు. దాంతో దళపతిని సంప్రదించాం. కథ నచ్చడంతో ఆయన వెంటనే ఓకే చెప్పేశారు అని తెలిపారు దిల్ రాజు. ఇక సంక్రాంతికి రికార్డు స్థాయి థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది వారసుడు. ఈ సినిమాకు ఇప్పటికే  50 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఇక రిలీజ్ తరువాత ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
జీమెయిల్ వాడేవారికి ఇక పండగే.. స్టన్నింగ్ ఫీచర్ తెచ్చిన గూగుల్
జీమెయిల్ వాడేవారికి ఇక పండగే.. స్టన్నింగ్ ఫీచర్ తెచ్చిన గూగుల్
ఇంటి కోసం ఉద్యోగులకు EPFO సపోర్ట్‌..!
ఇంటి కోసం ఉద్యోగులకు EPFO సపోర్ట్‌..!