Tollywood: ‘అమ్మోరు’ చిత్రంలో ఈ చైల్డ్ ఆర్టిస్టు గుర్తుందా? ఇప్పుడు తెలుగులో టాప్ నటి
అమ్మోరు చిత్రం అందరికీ బాగా గుర్తుంటుంది. కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ఈ మూవీలో రమ్యకృష్ణ, సౌందర్య ,రామిరెడ్డి వంటి నటీనటులు యాక్ట్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఈ మూవీలో అమ్మోరు పాత్రలో ఓ బాలనటి కూడా నటించింది. ఆమె ఇప్పుడు ఎలా ఉంది ? ఏం చేస్తుందో తెలుసుకుందాం...
1995 వ సంవత్సరం అప్పటికీ తెలుగునాట గ్రాఫిక్స్ గురించి పెద్దగా తెలియదు. ఆ సమయంలోనే స్టన్ అయ్యే హంగులతో అమ్మోరు చిత్రాన్ని తీసి ప్రేక్షకులు చేత జేజేలు అందుకున్నారు దర్శక దిగ్గజం కోడి రామకృష్ణ. ఈ సినిమాకు రూ.2 కోట్లు బడ్జెట్ అయితే.. అందులో కేవలం గ్రాఫిక్స్ కోసమే అక్షరాల రూ.80 లక్షలు ఖర్చుపెట్టారట. ఆయన మేకింగ్, టేకింగ్‌కి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమాలో లీడ్ రోల్స్ చేసిన రమ్మకృష్ణ, సౌంధర్యల క్రేజ్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. సినిమాకు తండోప తండాలుగా ప్రేక్షకులు తరలివెళ్లారు. మొక్కులు చెల్లించడం, అమ్మవారికి పాలాభిషేకం చేయడం వంటి సీన్స్ థియేటర్స్ వద్ద కనిపించాయి. ఈ సినిమా అప్పట్లో పది కోట్ల వరకు వసూలు చేసింది. ఇప్పటి లెక్కలో 100 కోట్లు కలెక్ట్ చేసినంత అని చెప్పాలి.
ఇక ఈ సినిమాలో సౌందర్య, రమ్యకృష్ణ తర్వాత చిన్నారి అమ్మోరుగా నటించిన పాపకు కూడా మంచి పాపులారిటీ వచ్చింది. తను ఇప్పుడు కూడా నటిగా రాణిస్తుందని మీకు తెల్సా.. అవునండీ తన పేరు సునయన. సినిమాలో ‘భవాని..’ అంటూ సౌంధర్యను పిలిచే ఆ పాప ఇప్పుడు కూడా తెలుగు సినిమాల్లో మంచి పాత్రలు చేస్తోంది. సునయ… ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్‌తో పాటు.. బేబి, ఓం భీమ్ బుష్, శబరి, ఇటీవల వచ్చిన స్వాగ్ చిత్రాల్లో యాక్ట్ చేసింది.
బేబి చిత్రంలో రాజేంద్రప్రసాద్ కూతురుగా గయ్యాలి పాత్రలో ఈ అమ్మాయి చక్కగా ఇమిడిపోయింది. ఇటు సినిమాలే కాకుండా.. యూట్యూబ్‌లో ఫ్రస్టేట్ ఉమేన్ అనే వీడియోలతో మంచి నేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఓ వైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్‌లతో కెరీర్‌లో చాలా బిజీగా ఉంది. మరోవైపు భర్త పిల్లలతో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తోంది.
View this post on Instagram