Tollywood: ఎమ్‌ఎన్‌సీ జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
చాలామంది లాగే ఈ ముద్దుగుమ్మ కూడా చదువులో టాపర్. కంప్యూటర్ సైన్స్ లో గ్రాడ్యుయేట్ అయిన ఈ అందాల తార హైదరాబాద్ నిఫ్ట్ లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు కూడా చేసింది. అలాగే అమెరికాలో స్టాటిస్టిక్స్ కోర్స్ చేసి ఎమ్ ఎన్ సీ కంపెనీలో జాబ్ కూడా చేసింది.

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. ఎంతలా అంటే ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలన్నీ హిట్లే. కానీ ఎందుకో గానీ ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోలేకపోతోంది. అందుకే 2017లో సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు కేవలం 8 సినిమాలే చేసింది. అందులోనూ రెండు క్యామియో పాత్రలే. విజయ్ దేవరకొండ, సత్య దేవ్, కిరణ్ అబ్బవరం, సిద్దూ జొన్నలగడ్డ లాంటి క్రేజీ హీరోలతో సినిమాలు చేసింది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందిచ్చింది. కానీ ప్రస్తుతం ఈ సొగసరికి హీరోయిన్ అవకాశాలే రావడం లేదు. ఈ బ్యూటీ హీరోయిన్ గా కనిపించి సుమారు మూడేళ్లు అవుతోంది. ఇక గతేడాది ఓ సూపర్ హిట్ సీక్వెల్ లో తళుక్కుమంది. ఇటీవలే రిలీజైన ఓ సూపర్ హిట్ సినిమాలోనూ ఓ క్యామియో రోల్ పోషించిందీ అందాల తార. ఈ సినిమాలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. కానీ స్టార్ హీరోయిన్ మెటీరియల్ అయిన ఈ బ్యూటీకి క్యామియో రోల్స్ రావడం దురదృష్టకరమంటున్నారు చాలామంది. కాగా ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు ఒకరో, ఇద్దరో ఉన్నారు. అందులో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు. మరి అనంతపురం జిల్లాకు చెందిన ఈ తెలుగందం ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు ఇటీవలే మ్యాడ్ స్క్వేర్ మూవీలో తళుక్కున మెరిసిన ప్రియాంక జువాల్కర్.
మ్యాడ్ స్క్వేర్ సినిమాలో లైలా అనే పాత్రలో కనిపించింది ప్రియాంక జువాల్కర్. అంతకు ముందు గతేడాది టిల్లు స్క్వేర్ మూవీలోనూ ఓ క్యామియో రోల్ పోషించింది. దీంతో ప్రియాంకను హీరోయిన్ గా చూడాలనుకున్న సినీ అభిమానులు నిరాశగా ఫీలవుతున్నారు. అంతకు ముందు గమనం, తిమ్మరుసు, ఎస్ ఆర్ కల్యాణ మండపం, ట్యాక్సీవాలా, కలవరమాయే సినిమాల్లో హీరోయిన్ గా నటించిందీ తెలుగుమ్మాయి.
మ్యాడ్ స్క్వేర్ సినిమాలో ప్రియాంక జువాల్కర్..
View this post on Instagram
ప్రియాంక లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
చీరలో ట్రెడిషినల్ గా..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.