AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అమ్మ బాబోయ్.. దేవీపుత్రుడు పాప ఇప్పుడు హీరోయిన్ అయిపోయిందిగా..

ఈ సినిమాలో వెంకటేష్ ని నేస్తం..అంటూ పిలిచే పాప మీకు గుర్తుందా... చిన్న వయసులోనే కళ్ళతో బోలెడు ఎక్స్‌ప్రేషన్స్ పలికించి ఆడియెన్స్ అభిమానాన్ని చూరగొన్న ఆ పాప పెద్దయ్యాక హీరోయిన్ అయింది. తెలుగులో కూడా హీరోయిన్‌గా ఓ సినిమా చేసింది. తను ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసుకుందాం పదండి..

Tollywood:  అమ్మ బాబోయ్.. దేవీపుత్రుడు పాప ఇప్పుడు హీరోయిన్ అయిపోయిందిగా..
Vega Tamotia
Ram Naramaneni
|

Updated on: Apr 01, 2025 | 7:58 PM

Share

విక్టరీ వెంకటేష్‌కు ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. అలా అని ఆయన ఆ తరహా సినిమాలనే చేయలేదు. విభిన్న ప్రయోగాలు చేసి.. అన్ని వర్గాల మెప్పు పొందాడు. ఆయన చేసిన ఓ ప్రయోగాత్మక సినిమా దేవిపుత్రుడు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమా కమర్షియల్ హిట్ అవ్వకపోయినా.. టెక్నికల్ వాల్యూస్ పరంగా మంచి పేరు తెచ్చుకుంది. సముద్రం అడుగున ఉన్న శ్రీకృష్ణుడి ద్వారకా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సాంకేతిక నిపుణుల ప్రశంసలు దక్కాయి.

దేవీ పుత్రుడు సినిమాలో వెంకటేష్, సౌందర్య, అంజలా జవేరి ప్రధాన పాత్రలు  పోషించారు. మణిశర్మ మ్యూజిక్ సినిమాకు పెద్ద ఎస్సెట్.  ఫాంటసీ డ్రామాగా వచ్చిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు.  అయితే ఈ మూవీలో కృష్ణుడు ఏలిన ద్వారక పాటలో కనిపించే.. క్యూట్ పాప మీకు గుర్తుందా..?  తను ఇప్పుడు ఎలా ఉంది.? ఏం చేస్తుంది అని చాలామంది సినిమా క్లిప్స్ చూసినవాళ్లు లేదా పాట చూసినవాళ్లు సెర్చ్ చేస్తున్నారు. ఆ వివరాలు మీ ముందుకు తీసుకొచ్చాం.

తన పేరు వేగా తమోటియా. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో కనిపించిన తను.. ఆ తర్వాత హీరోయిన్ అయింది. టాలీవుడ్‌లో వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కిన హ్యాపీ హ్యాపీగా అనే మూవీలో హీరోయిన్‌గా నటించింది. అలాగే తమిళం, హిందీ చిత్రాల్లో కూడా కనిపించింది. ప్రొడ్యూసర్‌గా సైతం తనలోని భిన్న కోణాన్ిన ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇండస్ట్రీ నుంచి దూరంగా జరిగింది. సామాజిక మాధ్యమాల్లో మాత్రం అప్పుడప్పుడు తన ఫోటోలు పంచుకుంటుంది. తను ఇప్పుడు ఎలా ఉందో మీరు కూడా చూసెయ్యండి.

View this post on Instagram

A post shared by Vega Tamotia (@vegatamotia)

;