Mohan Babu: చిన్నతనంలోనే తండ్రి హఠాన్మరణం..మోహన్ బాబు స్కూల్ లో చదువు.. ఇప్పుడు 300 కోట్ల టాలీవుడ్ హీరోయిన్
టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇటీవల కన్నప్ప సినిమాలో నటించిన ఆయన మంచి విద్యా వేత్త కూడా. శ్రీ విద్యానికేతన్ పేరిట పలు విద్యాసంస్థలను స్థాపించి భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్నారు మోహన్ బాబు.

టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ఇప్పటివరకు 500 కు పైగా సినిమాల్లో నటించారు. కేవలం హీరోగానే కాకుండా విలన్ గా, కమెడియన్ గా, నిర్మాతగా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. తన నటనా ప్రతిభతో అభిమానుల చేత కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ అని పిలిపించుకున్నారు. ఇటీవల కన్నప్ప సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించిన మోహన్ బాబు మంచి విద్యావేత్త కూడా. శ్రీ విద్యానికేతన్ పేరిట పలు విద్యా సంస్థలను నెలకొల్పిన ఆయన భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్నారు. అలాగే తన విద్యాసంస్థల్లో 25 శాతం మంది పిల్లలకు ఉచిత విద్య, ఫీజు రాయితీలతో చదివిస్తున్నారాయన. సామాన్యులతో పాటు టాలీవుడ్ లో పలువురు ప్రముఖ నటుల పిల్లల్ని కూడా తన విద్యాసంస్థలో చదివించినట్లు మోహన్ బాబు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అలా ఒక ఇంటర్వ్యూలో ఒక అమ్మాయి తన స్కూల్లో చదువుకొని ఇప్పుడు తమిళంలో టాప్ హీరోయిన్ గా ఎదిగిందని, ఆమె పేరు గుర్తు రావటం లేదని ఓ ఇంటర్వ్యూలో మోహన్ బాబు చెప్పుకొచ్చారు. ఇంతకు ఆయన ప్రస్తావించింది ఎవరి గురించో కాదట. ఇటీవలే రూ. 300 కోట్లతో బ్లాక్ బస్టర్ హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ గురించినేట.
టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె నే ఐశ్వర్య రాజేష్. సీనియర్ లేడీ కమెడియన్ శ్రీలక్ష్మి ఐశ్వర్య రాజేష్ కి స్వయానా మేనత్త అవుతుంది. అయితే ఐశ్వర్య తండ్రి రాజేష్ ఆమె చిన్నతనంలోనే కన్నుమూశారు. దీంతో ఆమె తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ స్కూల్ లోనే విద్య నభ్యసించారట. ఆ తర్వాత చెన్నైకి వెళ్లిందట. కాగా ఐశ్వర్య కోలీవుడ్ లో టాప్ హీరోయిన గా ఎదిగింది. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే లేడీ ఓరియంటెడ్ మూవీస్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో టాలీవుడ్ లోనూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏకంగా రూ. 300 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రంతో ఐశ్వర్య రాజేష్ కి తెలుగులో క్రేజ్ అమాంతం పెరిగింది.
ఐశ్వర్యా రాజేష్ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
ఐశ్వర్య రాజేష్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








