Actress : ఒక్క ఫేక్ వీడియోతో కెరీర్ నాశనం.. దెబ్బకు సన్యాసిగా మారిన హీరోయిన్.. ఇప్పుడు రహస్యంగా..
ఒకప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. అందం, అభినయంతో సినీరంగంలో తనదైన ముద్రవేసింది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఒక్క వీడియో ఆమె జీవితాన్ని మార్చేసింది. అగ్రకథానాయికగా పేరు సంపాదించుకున్న ఆమె.. గ్లామర్ ప్రపంచాన్ని వదిలేసి ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసింది. చాలా కాలం తర్వాత ఇప్పుడు ఆమె పేరు సోషల్ మీడియాలో వైరలవుతుంది.

గ్లామర్ ప్రపంచంలో తనదైన ముద్రవేసింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కానీ సినీరంగంలో తమకంటూ వచ్చిన స్టార్ స్టేటస్ కాపాడుకోవడం అంత సులభం కాదు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు.. అయినప్పటికీ కొంతమంది ధైర్యంగా తమ కెరీర్ స్టార్ట్ చేశారు. ఇండస్ట్రీలో గ్లామర్ గా కనిపిస్తుందో.. కొన్నిసార్లు స్క్రీన్ వెనుక సైతం ఎన్నో కుంభకోణాలు.. మరెన్నో సమస్యలు. చీకటి కోణాల్లో చిక్కుకున్న తర్వాత చాలా మందికి బయటపడి తమ కోల్పోయిన స్టార్ డమ్ తిరిగి పొందడం కష్టం అవుతుంది. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఆమె ఒకప్పుడు ఇండస్ట్రీలో అగ్రనటి. కానీ ఒక్క వీడియోతో ఆమె కెరీర్ నాశనమైంది.
ఆమె పేరు ప్రియాంక పండిట్. గతంలో ఈపేరు భోజ్ పురి సినీపరిశ్రమలో సుప్రసిద్ధ పేరు. ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. ఆమె ఔన్ పూర్ లో పెరిగారు. భోజ్ పురి సినీరంగంలో కెరీర్ మొత్తంలో 50 సినిమాల్లో నటించింది. అందం, అభినయంతోపాటు ఆకర్షణకు కీర్తిని సంపాదించుకుంది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే 2022లో ప్రియాంక జీవితం మలుపు తిరిగింది. ఆమె ఉన్నట్లు ఓ ఎంఎంఎస్ వీడియో ఆన్ లైన్ లో లీక్ అయ్యింది. దీంతో ఆమె సినీప్రయాణంపై దెబ్బపడింది. ఆ సంఘటన తర్వాత ఆమె వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలు వచ్చినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఆమె సినీరంగానికి దూరమయ్యింది.
తన పేరుతో లీక్ అయిన వీడియో ఫేక్ అంటూ అప్పట్లో ప్రియాంక గట్టిగానే వాధించింది. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు చేసిన కుట్ర అని అన్నారు. దీంతో తన కెరీర్ నాశనమైందంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత గ్లామర్ ప్రపంచం నుంచి దూరంగా వెళ్లిపోయింది. చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ప్రియాంక.. 2024లో కొత్త గుర్తింపుతో తిరిగి వచ్చింది. ఆమె శ్రీకృష్ణుడి పేరుతో ఉన్న బృందావనానికి మకాం మార్చింది. ఆధ్యాత్మిక ప్రయత్నాలకు తనను తాను అంకితం చేసుకుంది. ఆ తర్వాత ఆమె ఆధ్యాత్మిక మార్గం వైపు అడుగులు వేసింది. శ్రీకృష్ణుడిని ఆరాధించడం.. సేవ చేస్తూ గడిపేస్తుంది. అయితే ప్రియాంక రహస్యంగా పెళ్లి చేసుకుందని ప్రచారం నడిస్తుంది. దీనిపై సరైన క్లారిటీ రాలేదు.

Priyanka Pandit New
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..








