AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఏడో తరగతి ఫెయిల్.. రెస్టారెంట్‌లో గిన్నెలు కడిగాడు.. కట్ చేస్తే ఈ హీరో ఇప్పుడు 2500 కోట్లకు అధిపతి

సినిమా రంగం నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టినా చిన్నప్పటి నుంచి తన సొంత కాళ్లపై నిలబడేందుకు ప్రయత్నించాడీ హీరో. అందుకే జీవితంలో సక్సెస్ కావడానికి చాలా కష్ట పడ్డాడు. చేతికందిని పని చేశాడు. చివరకు రెస్టారెంట్ లో గిన్నెలు కూడా కడిగాడు.

Tollywood: ఏడో తరగతి ఫెయిల్.. రెస్టారెంట్‌లో గిన్నెలు కడిగాడు.. కట్ చేస్తే ఈ హీరో ఇప్పుడు 2500 కోట్లకు అధిపతి
Bollywood Actor
Basha Shek
|

Updated on: Nov 11, 2025 | 7:19 PM

Share

పై ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తు పట్టారా? ఈ అబ్బాయి ఇప్పుడు పాన్ ఇండియా హీరో. తన అద్భుతమైన నటనతో దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. లెక్కలేనన్నీ అవార్డులు, ప్రశంసలు అందుకున్నాడు. ఇక మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న ఈ నటుడు ఆస్తులు కోట్లలో ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుల్లో ఈ హీరో కూడా ఒకడు. అంతేకాదు దేశంలో అత్యధి ఆదాయం ఉన్న నటుల జాబితాలోనూ ఉన్నాడు. ప్రస్తుతం ఈ నటుడి ఆస్తి సుమారు రూ. 2500కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు లగ్జరీ లైఫ్ అనుభవిస్తోన్న ఈ హీరో ఈ స్థాయికి రావడానికి చాలా కష్టాలు పడ్డాడు. ఒకప్పుడు ఒక ట్రావెల్ ఏజెన్సీలో నెలకు రూ.150కి కూలీగా పనిచేశాడు. పొట్టకూటి కోసం హోటల్లో వెయిటర్‌‌గా పనిచేశారు. గిన్నెలు కూడా కడిగాడు. అయితే నటనపై మక్కువతో కష్టాలన్నీ అధిగమించి స్టార్ హీరోగా ఎదిగాడు. దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ హీరో మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్.

గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అక్షయ్ చిన్నతనంలో తాను పడిన కష్టాలను గుర్తు చేసుకున్నాడు. ‘నాకు చదువుపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఏడో తరగతి ఫెయిల్ అయ్యాను. కోల్ కతాలో ఒక ట్రావెల్ ఏజెన్సీలో పని చేస్తున్నప్పుడు నా జీతం రూ.150 నుంచి రూ. 200 వరకు ఉండేది’ చాందిని చౌక్‌లోని ఒకే ఇంట్లో 24 మందిమి కలిసి ఉండే వాళ్లం. అందరం ఒకే గదిలో నిద్రపోయే వాళ్లం. ఉదయం బయటకు రావాలంటే అందరిపై నుంచి దూకాల్సి వచ్చేది’ అని చిన్నప్పటి కష్టాలను గుర్తు చేసుకున్నాడు అక్షయ్.

భార్య ట్వింకిల్ ఖన్నాతో అక్షయ్ కుమార్..

సినిమాల్లోకి రాకముందు అక్షయ్ కుమార్ బ్యాంకాక్‌ లో చెఫ్, వెయిటర్‌‌గా పని చేసేవాడు. ఆ టైమ్‌లో పాత్రలు కూడా కడిగేవాడట. అలాంటి వాడు ఇప్పుడు భారతదేశంలోని అత్యంత ధనవంతులైన నటుల్లో ఒకరిగా ఎదిగాడు.ముంబైలో అక్షయ్ కు 80 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లా, రూ.2,500 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.

మంచు విష్ణు కన్నప్ప సినిమా ప్రమోషన్లలో అక్షయ్ కుమార్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.