Balakrishna: బాలయ్యకు తల్లిగా, ప్రియురాలిగా, భార్యగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా? 50 ప్లస్ లోనూ అదే అందం
సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణది ప్రత్యేక స్థానం. ఇతర హీరోలకు భిన్నంగా అన్ని జానర్ సినిమాల్లో నటించిన అతి కొద్ది మంది నటుల్లో బాలయ్య కూడా ఒకరు. ముఖ్యంగా ప్రజెంట్ జనరేషన్ హీరోలు టచ్ చేయని పౌరాణిక సినిమాలతోనూ బ్లాక్ బస్టర్స్ అందుకున్నారీ నందమూరి నటసింహం

ఎన్టీఆర్ నట వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నందమూరి బాలకృష్ణ. లవ్, కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు పౌరాణిక సినిమాలతోనూ బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు బాలయ్య. పాండు రంగడు, శ్రీరామరాజ్యం, గౌతమీ పుత్ర శాతకర్ణి తదితర పౌరాణిక సినిమాల్లో బాలయ్య నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కేవలం నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగానూ సత్తా చాటుతున్నారు బాలయ్య. హిందూపురం ఎమ్మెల్యేగా వరుసగా మూడు సార్లు గెలిచి చరిత్ర సృష్టించారాయన. ప్రస్తుతం అఖండ తాండవం సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్నారీ నందమూరి హీరో. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా ఇది తెరకెక్కుతోంది. మొదటి పార్ట్ ను తెరకెక్కించిన బోయపాటి శీనునే అఖండ సీక్వెల్ ను కూడా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన గ్లింప్స్ బాలయ్య అభిమానులను విపరీతంగ ఆకట్టుకుంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న అఖండ పార్ట్ 2 దసరా కానుకాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే మీకు ఈ విషయం తెలుసా? బాలయ్యకు ఒక హీరోయిన్ తల్లిగా, ప్రియురాలిగా, భార్యగా నటించింది. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ అందాల తార టబు.
2002లో విడుదలైన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘చెన్నకేశవ రెడ్డి’ చిత్రంలో టబు, బాలకృష్ణకు భార్యగా, తల్లిగా నటించి మెప్పించింది. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. అప్పట్లో ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఆరేళ్లకు, 2008లో వచ్చిన ‘పాండురంగడు’ సినిమాలోనూ బాలకృష్ణకు ప్రియురాలిగా నటించింది టబు. ప్రస్తుతం టాలీవుడ్ డ్యాషిండ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తోన్న ఓ సినిమాల కీలక పాత్ర పోషిస్తోందీ అందాల తార. దీంతో పాటు బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజి బిజీగా ఉంటోందీ ముద్దుగుమ్మ.
హీరోయిన్ టబు లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
ఆ మధ్యన వచ్చిన వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య కు తల్లిగా, ప్రియురాలిగా నటించింది మలయాళ నటి హనీ రోజ్. ఇందులోనూ బాలయ్య ద్విపాత్రాభినయం చేయడం విశేషం.
డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఛార్మీలతో టబు..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








