Pelli Choopulu: ‘పెళ్లి చూపులు’ సినిమాకు విజయ్ ఫస్ట్ ఛాయిస్ కాదట.. సూపర్ హిట్‏ను మిస్ చేసుకున్న ఆ యంగ్ హీరో ఎవరంటే..

అతను కూడా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. కానీ అనుహ్యంగా ఈ ఛాన్స్ విజయ్‏ను వరించిదట. ఇంతకీ ఆ యంగ్ హీరో ఎవరో తెలుసుకుందామా.

Pelli Choopulu: 'పెళ్లి చూపులు' సినిమాకు విజయ్ ఫస్ట్ ఛాయిస్ కాదట.. సూపర్ హిట్‏ను మిస్ చేసుకున్న ఆ యంగ్ హీరో ఎవరంటే..
Pelli Choopulu
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 07, 2022 | 5:17 PM

పెళ్లిచూపులు (Pelli Choopulu).. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండకు స్పెషల్ క్రేజ్ తీసుకువచ్చింది ఈ సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అందుకుంది. స్క్రీన్ ప్లే, కామెడీ టైమింగ్, డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. అయితే ఈ మూవీ కోసం హీరోగా అనుకున్నది ముందుగా విజయ్ దేవరకొండను (Vijay Deverakonda) కాదట. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ స్టోరీని ఫస్ట్ ఓ యంగ్ హీరోకు వినిపించారని.. అతను కూడా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. కానీ అనుహ్యంగా ఈ ఛాన్స్ విజయ్‏ను వరించిదట. ఇంతకీ ఆ యంగ్ హీరో ఎవరో తెలుసుకుందామా.

అతను మరెవరో కాదు. యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. పెళ్లి చూపులు కథను ముందుగా తరుణ్ భాస్కర్ నిఖిల్‏కు చెప్పాడట. ఆ స్టోరీ నచ్చడంతో.. వెంటనే చేసేద్దాం అని నిఖిల్ చెప్పాడట. కానీ అప్పటికీ ఇంకా ప్రొడ్యూసర్ ఫైనల్ కాలేదు. దీంతో తరుణ్ ప్రొడ్యూసర్ కోసం వెతికే పనిలో ఉండగా.. నిఖిల్ ఎక్కడికి పోతావ్ చిన్నవాడా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆ తర్వాత ప్రొడ్యూసర్ ఒకే అయినా.. నిఖిల్ తన రాబోయే సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమాకు విజయ్ ను ఎంపిక చేశారట. కానీ దేవరకొండ కెరీర్‏లో ఈ సినిమా మాత్రం ప్రత్యేకమనే చెప్పుకోవాలి. ఇటీవలే కార్తికేయ 2 చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు నిఖిల్. తెలుగులోనే కాకుండా హిందీలోనూ రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది ఈ మూవీ. ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.