AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sita Ramam: సీతారామం మూవీ నుంచి డిలీటెడ్ సీన్.. అద్భుతమైన డైలాగ్స్.. మీరు చూశారా..?

పర్లేదు.. ఇండియాలో నీలాంటి వాళ్లున్నారన్న మాట అంటుంది. దానికి క్యాబ్ డ్రైవర్..

Sita Ramam: సీతారామం మూవీ నుంచి డిలీటెడ్ సీన్.. అద్భుతమైన డైలాగ్స్.. మీరు చూశారా..?
Sitaramam
Rajitha Chanti
|

Updated on: Sep 07, 2022 | 4:30 PM

Share

డైరెక్టర్ హనురాఘవపూడి తెరకెక్కించిన సీతారామం  (Sita Ramam)సినిమా సూపర్ హిట్‏గా నిలిచింది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రావడమే కాకుండా.. వసూళ్లు పరంగానే దూసుకుపోయింది. మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్.. బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమా ఆగస్ట్ 5న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ అందమైన ప్రేమకథ దక్షిణాది ప్రేక్షకుల మనసులను తాకింది. ఇప్పటికీ ఆయా ప్రాంతాల్లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే.. ఇటీవలే హిందీలోనూ విడుదలైన మంచి టాక్ సంపాదించుకుంది. ఈ మూవీ కంటెంట్ మాత్రమే కాకుండా.. సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖరన్ అందించిన సంగీతం శ్రోతలను కట్టిపడేసింది. మహానటి సినిమాతో ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) ఈ మూవీతో మరోసారి ఆడియన్స్ కు దగ్గరయ్యాడు.

ఇక ఈ మూవీ విడుదలైన నెల రోజులు పూర్తైన సినిమా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. తాజాగా సీతారామం నుంచి డిలిటెడ్ సీన్ రిలీజ్ చేశారు మేకర్స్. అందులో సీతామహాలక్ష్మీ కోసం వెతుకుతూ వెళ్లే క్రమంలో రష్మిక క్యాబ్ లో ఓ ప్యాలెస్ వద్దకు వెళ్తుంది. హడావిడిలో తన బ్యాగ్‏ను క్యాబ్ లోనే మర్చిపోయి లోపలికి వెళ్తుంది. కాసేపటికి బ్యాగ్ కోసం వెనక్కి వచ్చి డ్రైవర్ తో ఇంకా ఇక్కడే ఉన్నావా. పర్లేదు.. ఇండియాలో నీలాంటి వాళ్లున్నారన్న మాట అంటుంది. దానికి క్యాబ్ డ్రైవర్.. ఇండియాలో అందరూ నాలానే ఉంటారు. మీ బ్యాగ్ తీసుకపోయి నా దేశం పరువు మీతో పంపలేను కదా మేడం అంటూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఇంత అద్భుతమైన డైలాగ్ ఉన్న సీన్ ఎందుకు తీసివేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇందులో రష్మిక.. తరుణ్ భాస్కర్.. సుమంత్ కీలకపాత్రలలో నటించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం