AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకప్పుడు పాల వ్యాపారం వ్యాపారం, తర్వాత మెకానిక్.. కట్ చేస్తే టాలీవుడ్ లో తిరుగులేని నటుడు

ఇండస్ట్రీలో తిరుగులేని నటుడిగా పేరు తెచ్చుకున్నారు అయ్యాను. విలన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఆ తర్వాత ఎన్నో వైవిధ్యమైన పాత్రలో చేశారు. తెలుగు సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు ఆయన. విలన్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత సహాయక పాత్రలు చేస్తూ ఆ తర్వాత హీరోగా మారారు.

ఒకప్పుడు పాల వ్యాపారం వ్యాపారం, తర్వాత మెకానిక్.. కట్ చేస్తే టాలీవుడ్ లో తిరుగులేని నటుడు
Tollywood Hero
Rajeev Rayala
|

Updated on: Nov 16, 2026 | 1:17 PM

Share

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చి, కేవలం తమ ప్రతిభ, కష్టపడే తత్వంతో స్టార్లుగా ఎదిగిన వారు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. పైన కనిపిస్తున్న ఈ విలక్షణ నటుడు కూడా ఆ కోవకే చెందుతారు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆయన.. విలన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వందలాది చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. కేవలం వెండితెరపైనే కాకుండా, నిజ జీవితంలోనూ కష్టాల్లో ఉన్నవారికి నేనున్నాను అంటూ ఆపన్నహస్తం అందించిన గొప్ప మానవతావాది ఆయన. ఇంతకీ ఆ లెజెండరీ నటుడు ఎవరో గుర్తుపట్టారా? ఆయనే మన టాలీవుడ్ రియల్ స్టార్ దివంగత నటుడు శ్రీహరి. సినిమాల్లోకి రాకముందు శ్రీహరి జీవితం ఎన్నో ఒడిదుడుకుల మధ్య సాగింది. కుటుంబ పోషణ కోసం ఆయన కొన్నాళ్ల పాటు పాల వ్యాపారం చేశారు. ఆ తర్వాత ఒక మెకానిక్ షెడ్ కూడా నడిపారు. అయితే, ఆయనకు చిన్నప్పటి నుంచి క్రీడలంటే ప్రాణం. ముఖ్యంగా జిమ్నాస్టిక్స్‌లో రాష్ట్ర స్థాయి ఛాంపియన్‌గా నిలిచిన శ్రీహరి, ఏషియన్ గేమ్స్‌లో భారతదేశం తరపున ఆడాలని కలలు కన్నారు. బాడీ బిల్డింగ్‌లోనూ సత్తా చాటి ఏకంగా ఏడుసార్లు ‘మిస్టర్ హైదరాబాద్’ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.

జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్ పోటీలకు సిద్ధమవుతున్న సమయంలోనే ఆయన దృష్టి సినిమాల వైపు మళ్లింది. 1989లో తమిళ చిత్రం ‘మా పిళ్ళై’, తెలుగులో ‘ధర్మక్షేత్రం’ సినిమాలతో ఆయన సినీ ప్రయాణం మొదలైంది. తొలినాళ్లలో స్టంట్ మాస్టర్‌గా పనిచేసిన శ్రీహరి, ఆ తర్వాత విలన్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నారు. విలన్‌గా భయపెట్టిన శ్రీహరి, ఆ తర్వాత హీరోగా మారి ‘భద్రాచలం’, ‘కుబుసం’, ‘ఒరేయ్ తమ్ముడు’ వంటి విజయవంతమైన చిత్రాలతో మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆయన పోషించిన పాత్రలు సినిమాకే ప్రాణం పోశాయి.

మగధీర సినిమాలో షేర్ ఖాన్ పాత్రలో ఆయన గంభీరమైన గొంతు, నటన సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో చెల్లెలిపై అపారమైన ప్రేమ ఉన్న అన్నయ్య ‘శివరామకృష్ణ’ పాత్రలో ప్రేక్షకులను కంటతడి పెట్టించారు. వీటితో పాటు ఢీ, కింగ్, బృందావనం, తుఫాన్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో తనదైన మార్క్ నటనతో మెప్పించారు. దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించిన శ్రీహరి భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన పోషించిన అద్భుతమైన పాత్రలు, ఆయన చేసిన సేవా కార్యక్రమాల ద్వారా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు.

ఇవి కూడా చదవండి

Srihari

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఒకప్పుడు పాల వ్యాపారం వ్యాపారం, తర్వాత మెకానిక్..
ఒకప్పుడు పాల వ్యాపారం వ్యాపారం, తర్వాత మెకానిక్..
కార్తీక సోమవారం ఉపవాసం ముగిసిన తర్వాత ఏం తినాలి?
కార్తీక సోమవారం ఉపవాసం ముగిసిన తర్వాత ఏం తినాలి?
పంట గడ్డితో సబ్బులు తయారు చేయవచ్చా?శాస్త్రవేత్తల కొత్త విధానం ఇదే
పంట గడ్డితో సబ్బులు తయారు చేయవచ్చా?శాస్త్రవేత్తల కొత్త విధానం ఇదే
ఇంటి నిర్మాణం రోడ్డుకు ఎంత ఎత్తులో కట్టాలి? ఇలా అస్సలు చేయకండి!
ఇంటి నిర్మాణం రోడ్డుకు ఎంత ఎత్తులో కట్టాలి? ఇలా అస్సలు చేయకండి!
చిరంజీవి రిక్షావోడు సినిమా చూస్తున్న టైంలో ఆ విషాదం తెలిసింది..
చిరంజీవి రిక్షావోడు సినిమా చూస్తున్న టైంలో ఆ విషాదం తెలిసింది..
విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు
విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు
చాలా మందికి తెలియదు.. రూ.లక్ష జమ చేస్తే చాలు.. రూ.45 వేల వడ్డీ!
చాలా మందికి తెలియదు.. రూ.లక్ష జమ చేస్తే చాలు.. రూ.45 వేల వడ్డీ!
నేను చేసిన పనికి మా అమ్మానాన్న అప్సెట్ అయ్యారు..
నేను చేసిన పనికి మా అమ్మానాన్న అప్సెట్ అయ్యారు..
WTC ఫైనల్స్‌పై ఐసీసీ కీలక ప్రకటన.. 2035 వరకు తేదీలు ఖరారు
WTC ఫైనల్స్‌పై ఐసీసీ కీలక ప్రకటన.. 2035 వరకు తేదీలు ఖరారు
మద్యం మాత్రమే కాదు.. ఈ అలవాట్లు కూడా కాలేయాన్ని దెబ్బతీస్తాయి!
మద్యం మాత్రమే కాదు.. ఈ అలవాట్లు కూడా కాలేయాన్ని దెబ్బతీస్తాయి!