AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakul Preet Singh: ‘సినిమాలను అలా చూడటం మాత్రమే ఇష్టం’.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రకుల్..

నాకు థ్రిల్లర్ అంటే చాలా ఇష్టం. కానీ వినోదాత్మకమైన కంటెంట్ ను థియేటర్లో చూడాలని ఉంటుంది. నిజానికి నేను థియేటర్ లో సినిమా చూడాలనుకుంటాను

Rakul Preet Singh: 'సినిమాలను అలా చూడటం మాత్రమే ఇష్టం'.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రకుల్..
Rakul
Rajitha Chanti
|

Updated on: Sep 07, 2022 | 5:42 PM

Share

టాలీవుడ్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఇప్పుడు నార్త్ పై ఫోకస్ పెట్టింది. గత కొద్ది రోజులుగా హిందీలో వరుస సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయ్యింది ఈ పంజాబీ బ్యూటీ. తెలుగులో చివరగా కొండపొలం మూవీలో కనిపించిన రకుల్.. ఆ తర్వాత టాలీవుడ్ నుంచి ఎలాంటి ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. బీటౌన్‏లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్న రకుల్.. తాజాగా థియేటర్స్… ఓటీటీల గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. బాలీవుడ్ హంగామాతో ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న రకుల్.. తన అభిరుచులు..కంటెంట్ గురించి తెలిపింది.తాను సినిమాలను తీయడానికి పడిన శ్రమ ఎలా ఉంటుందో తనకు తెలుసునని.. అందుకే థియేటర్లలో మూవీ చేసేందుకు ఇష్టపడతానని తెలిపింది. అలాగే ఓటీటీ కంటెంట్ గురించి స్పందిస్తూ.. “నాకు థ్రిల్లర్ అంటే చాలా ఇష్టం. కానీ వినోదాత్మకమైన కంటెంట్ ను థియేటర్లో చూడాలని ఉంటుంది. నిజానికి నేను థియేటర్ లో సినిమా చూడాలనుకుంటాను” అంటూ చెప్పుకొచ్చింది.

థియేటర్‏కు వచ్చే ప్రతి సినిమాను చూడాలని కాదు. కానీ సాధ్యమైనంతవరకు కొన్ని సినిమాలను థియేటర్లో చూసేందుకు ఇష్టపడతాను. ఇంట్లో ఉండి ఎంత గొప్ప సినిమా చూసిన అది థియేటర్ స్క్రీన్ కు సాటి రాదు. నేను సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా.. ఒక మూవీ తీయాలంటే ఎంత కష్టపడాలో మాకు తెలుసు. సినిమా కోసం నటీనటులు తక్కువగా పనిచేస్తారు. కానీ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి లైన్ మెన్ వరకు దాదాపు 14 -15 గంటలు అక్కడే వర్క్ చేస్తారు. వాళ్ల కోసమే థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలనుకుంటున్నాను అని తెలిపింది. ప్రస్తుతం రకుల్.. ఛత్రివాలి, థాంక్స్ గాడ్, డాక్టర్ జీ చిత్రాల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా ఇండియన్ 2 మూవీలోనూ నటిస్తుంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం