AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంపాదించిన డబ్బు నగలతో భర్త జంప్.. స్టార్ హీరోయిన్ లైఫ్ లో ఊహించని షాక్

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ స్టార్ గా ఓ వెలుగు వెలిగారు వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా రాణించిన ఆమె .. వ్యక్తిగత జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. అంతే కాదు ఆమె భర్త నమ్మించి మోసం చేశాడు.

సంపాదించిన డబ్బు నగలతో భర్త జంప్.. స్టార్ హీరోయిన్ లైఫ్ లో ఊహించని షాక్
Actress
Rajeev Rayala
|

Updated on: May 21, 2026 | 10:53 AM

Share

అలనాటి తార కమలా కొట్నీస్ జీవితం, సినీ ప్రస్థానం అరుదైన సంఘటనలు, వ్యక్తిగత ఒడిదొడుకులతో నిండి ఉంది. 1928లో కర్నూలులో బ్రిటిష్ ఆర్మీ అధికారికి, తెలుగు తల్లికి పుట్టిన కమలా కొట్నీస్, తెలుగు సినిమా చరిత్రలో తనదైన ముద్రవేశారు  చిన్నతనంలోనే ఒక జమీందారుచే దత్తత తీసుకోబడి, కమలా బాయిగా పేరుపొందింది. ఆమె సోదరి లీలారాణి కూడా ఒక ఎస్టేట్ వారసుడిని వివాహం చేసుకోవడంతో, వీరు రాయల్ ఫ్యామిలీకి చెందినవారు అయ్యారు. కమలా కొట్నీస్ సినీ ప్రస్థానం ప్రభాత్ ఫిల్మ్స్‌తో ప్రారంభమైంది. ఆ రోజుల్లో నాగిరెడ్డి వంటి నిర్మాతలు కళాకారులను నెల జీతానికి కాంట్రాక్ట్ చేసేవారు. అదేవిధంగా, ప్రభాత్ ఫిల్మ్స్ నటన నేర్పించి, వారి చిత్రాలలో నటింపజేసేది. అగ్రిమెంట్ నటిమణిగా చేరిన కమలా కొట్నీస్, దేవనంద్ తొలి చిత్రం హమ్ ఏక్ హైలో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత సుహాగన్, ఆగే బడో వంటి మరో మూడు హిందీ చిత్రాలలో దేవనంద్‌తో కలిసి నటించింది. తెలుగు సినిమా రంగంలో, కమలా కొట్నీస్ తనదైన ముద్ర వేసింది.

ఇది కూడా చదవండి : సినిమా వచ్చి 22ఏళ్లు.. కుర్రాళ్ళు థియేటర్స్‌లో ఎగబడి చూశారు.. ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టని మూవీ

1940లో విడుదలైన జీవనజ్యోతి చిత్రంలో సీ.హెచ్. నారాయణరావు సరసన కృష్ణవేణి స్నేహితురాలిగా నటించింది. ఆ తర్వాత సీ. పుల్లయ్య బాలనాగమ్మ, చెంచులక్ష్మి, భాగ్యలక్ష్మి వంటి చిత్రాలతో పాటు వై.వి. రావు, సీ.ఎస్. రావు దర్శకత్వంలోనూ పలు చిత్రాలలో నటించింది. 1949 నాటికి దాదాపు 10-12 చిత్రాలలో నటించిన ఈమె, ఆ తర్వాతి కాలంలో సతీ అహల్య అనే సినిమాను స్వయంగా నిర్మించి తీవ్రమైన నష్టాలను చవిచూసింది. ఈ నిర్మాణ ప్రయాణంలో ఆమె ఆర్థికంగా దెబ్బతిన్నది. కమలా కొట్నీస్ వ్యక్తిగత జీవితం కూడా ఎన్నో సవాళ్లతో కూడి ఉంది. ఆమె బొంబాయిలో ప్రముఖ ఫోటోగ్రాఫర్ డి.ఎస్. కొట్నీస్ సోదరుడిని వివాహం చేసుకుంది. అయితే, 1949లో ఈమె సంపాదించిన డబ్బు, నగలతో భర్త పారిపోవడంతో ఆమె తీవ్ర అవమానానికి గురైంది. ఈ సంఘటన తర్వాత ఆమె కొట్నీస్ ఇంటి పేరును వదిలివేసింది. చంద్రదేవ్ సింగ్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. అయితే, 1967లో చంద్రదేవ్ సింగ్ ఒక సరస్సులో పడి మరణించడం ఆమె జీవితంలో మరో విషాదం.

ఇది కూడా చదవండి : ఎన్టీఆర్ వల్లే నా పెళ్లి జరిగింది.. తారక్ చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేను

నటనతో పాటు, కమలా కొట్నీస్‌కు కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నాయి. ఆమె మోటార్‌బైక్ బాగా నడిపేవారు, టెన్నిస్ ఆడటంలో మాస్టర్. అంతేకాకుండా, సావిత్రి గారిలాగే కార్ డ్రైవింగ్‌లోనూ ఆమెకు ప్రత్యేక ప్రావీణ్యం ఉండేది, పోటీలలో కూడా పాల్గొనేవారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో ప్లేబ్యాక్ గానం ప్రారంభమైన తర్వాత, గాయని రావు బాలసరస్వతి దేవి మొదటిసారి తిన్నె మీద చిన్నోడా అంటూ ఈమె కోసమే పాడారు. హీరోయిన్ గా చెరగని ముద్ర వేసిన కమలా కొట్నీస్.. వ్యక్తిగతజీవితంలో మాత్రం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఇది కదా సినిమా అంటే..! రూ.10లక్షలు పెడితే.. రూ.10కోట్లలకు పైగా కలెక్షన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us