Gabbar Singh: ‘గబ్బర్ సింగ్’కు పవన్ కల్యాణ్ ఫస్ట్ ఛాయిస్ కాదా? ఆ స్టార్ హీరో ఎస్ మిస్ చేసుకున్నాడబ్బా!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఇండస్ట్రీ హిట్స్ మూవీస్ లో గబ్బర్ సింగ్ ఒకటి. క్రేజీ డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ పోలీస్ కాప్ స్టోరీ పవన్ కల్యాణ్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా అమితంగా ఆకట్టుకుంది.

పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్. 2012లో విడుదలైన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా అప్పటివరకు ఫ్లాపుల్లో ఉన్న పవన్ కల్యాణ్ కు ఈ గబ్బర్ సింగ్ మూవీ బిగ్ బూస్ట్ ఇచ్చింది. బండ్ల గణేష్ నిర్మించిన ఈ మూవీలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే సుహాసిని, నాగినీడు, అభిమాన్యుసింగ్, రావు రమేశ్, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించార. బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ‘కెవ్వు కేక’ అనే స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. ఇందులో వెంకట రత్నం నాయుడు అలియాస్ గబ్బర్ సింగ్ గా పవన్ అభినయం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక అతని డ్యాన్స్ లు, ఫైట్స్ కు థియేటర్లో ఈలలు పడ్డాయి. భారీ వసూళ్లతో తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులన తిరగరాసిన గబ్బర్ సింగ్ మూవీ పవన్ కెరీర్ లో కూడా మర్చిపోలేనదని చెప్పువచ్చ. అలాగే డైరెక్టర్ హరీశ్ శంకర్, నిర్మాత బండ్ల గణేష్ కెరీర్ లను కూడా ఈ మూవీ మలుపు తిప్పిందని చెప్పవచ్చు. మరి ఇన్ని రికార్డులు, ఇన్ని విశేషాలున్న గబ్బర్ సింగ్ మూవీకి హీరోగా పవన్ కల్యాణ్ ఫస్ట్ ఛాయిస్ కాదట.
రవితేజ హీరోగా నటించిన షాక్ సినిమాతో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమయ్యాడు హరీష్ శంకర్. అయితే ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. దీంతో ఆరేళ్లు గ్యాప్ తీసుకొని మరి మళ్లీ రవితేజతో మిరపకాయ్ సినిమా తీశాడు. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తన కెరీర్ కు బిగ్ బూస్ట్ ఇచ్చిన మాస్ మహారాజా తోనే మూడో సినిమా తీయాలనుకున్నాడు హరీశ్ శంకర్. దానికోసం గబ్బర్ సింగ్ కథ అనుకున్నాడు. అయితే అప్పటికే దబాంగ్ సినిమా రైట్స్ పవన్ కల్యాణ్ దగ్గర ఉన్నాయట. దీంతో ఈ సినిమా రవితేజ చేతిలో నుంచి జారిపోయింది. చివరికీ పవన్ కల్యాణ్ చేతుల్లోకి వెళ్లిపోయింది.
కాగా రవితేజ నటించిన సూపర్ హిట్ సినిమాలైన ఇడియట్, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి మొదట పవన్ కల్యాణ్ దగ్గరకు వచ్చినవే. అయితే వివిధ కారణాలతో పవన్ వీటిపై పెద్దగాఆసక్తి చూపించలేదు.
మాస్ జాతర సినిమాలో రవితేజ, శ్రీలీల
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








